స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోసారి ఎమర్జెన్సీ అలెర్ట్ అలారమ్స్ పంపిన భారత ప్రభుత్వం.. కారణమేంటంటే?
కొన్ని రోజుల క్రితం ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద బీప్ సౌండ్ చేస్తూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అలర్టులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపించింది. తాజాగా ఈరోజు ఉదయం 11:35 నిమిషాల ప్రాంతంలో మరోసారి ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్స్ వాడే యూజర్లకు ఎమర్జెన్సీ అలర్టులు పంపబడ్డాయి. అయితే ఈ అలర్ట్ ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం ని టెస్ట్ చేయడంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇలాంటి మెసేజ్ పంపిందని తెలుస్తోంది.
సిబీస్ పద్ధతి ద్వారా ఎమర్జెన్సీ అలర్టులు
ఎమర్జెన్సీ అలర్టులు అనేవి భారతదేశవ్యాప్తంగా చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు పంపబడ్డాయి. ఈ అలర్ట్ వచ్చినప్పుడు పెద్దగా బీప్ సౌండ్ రావడంతో పాటు ఎమర్జెన్సీ అలర్ట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ మెసేజ్ ఇంగ్లీషుతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ ఉంటుంది. ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టం(CBS) ద్వారా ఇలాంటి మెసేజ్ ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండేందుకే ఇలాంటి అలర్టులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపుతుంది.