నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్
స్నాప్ చాట్ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను విడుదల చేసింది.వినియోగదారుల సంఖ్య పెరగినా. ఆదాయం, లాభాలకు సంబంధించిన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెరుగుతున్న యూజర్ బేస్‌ను మానిటైజ్ చేయడం అనేది స్నాప్ చాట్ ఉద్దేశం. డిజిటల్ అడ్వర్టైజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ తన ఆదాయన్ని వివిధ మార్గాల్లో పెంచేలా ప్రణాళికలు వేస్తుంది. అయితే, కొనసాగుతున్నమాంద్యం భయాలు ప్రకటన వ్యయాన్ని తగ్గించాయి. 2022 చివరి త్రైమాసికంలో, స్నాప్ చాట్ లో 12 మిలియన్లతో మొత్తం రోజువారీ ఆక్టివ్ యూజర్లు (DAU) 375 మిలియన్లకు చేరుకున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, ముఖ్యంగా భారతదేశంలో స్నాప్‌చాట్ యూజర్ బేస్ పెరిగింది. నాల్గవ త్రైమాసికంలో, DAU సంవత్సరానికి 17% లేదా 56 మిలియన్లు పెరిగింది.
గత త్రైమాసికంలో స్నాప్ చాట్ సబ్స్క్రైబర్స్ రెండు మిలియన్లకు చేరుకున్నారు
మొదట జూన్ 2022లో ప్రారంభమైన ఈ సబ్స్క్రిప్షన్ భారతదేశంలో ఆగస్టు 2022లో ప్రారంభమైంది. సబ్స్క్రిప్షన్ నెలకు రూ. 49 (60 సెంట్లు). స్నాప్ చాట్ నాల్గవ త్రైమాసికంలో $1.3 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది, ఇది అంతకు ముందు సంవత్సరంలో $1.298 బిలియన్ల నుండి స్వల్పంగా పెరిగింది. కంపెనీ వార్షిక ఆదాయం 12% పెరిగి $4.6 బిలియన్లకు చేరుకుంది. గత త్రైమాసికంలో $23 మిలియన్లతో పోలిస్తే $288 మిలియన్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. వార్షిక నికర నష్టం కూడా 2021లో $488 మిలియన్ల నుండి $1.43 బిలియన్లకు పెరిగింది. 2023 మొదటి మూడు నెలల్లో స్నాప్ చాట్ ఆదాయం 2% నుండి 10% తగ్గే అవకాశం ఉంది.