WhatsApp: త్వరలో వాట్సాప్ మెసేజ్‌లకు రెండుసార్లు రియాక్ట్ అయ్యే అవకాశం
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇప్పటికే ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. ఒకసారి వచ్చే వాట్సాప్ మేసేజ్‌లకు రెండుసార్లు రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. డబుల్ ట్యాప్ రియాక్షన్ సదుపాయం వినియోగదారులను డిఫాల్ట్ హార్ట్ ఎమోజితో రియాక్ట్ అయ్యేలా మెసేజ్ కు రెండుసార్లు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
త్వరలో మరిన్ని వివరాలు
వినియోగదారులు వేరొక ఎమోజితో ప్రతిస్పందించాలనుకుంటే తప్ప రియాక్షన్ ట్రేని తెరవాల్సిన అవసరం లేదు. చాట్ హిస్టరీని స్క్రోల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా పాత సందేశాలకు ప్రతిస్పందించే కొంతమంది వినియోగదారులకు ఈ ఫీచర్ వల్ల అసౌకర్యం కలగవచ్చు. స్క్రీన్ నుండి ఫోటోలు, వీడియోలు, GIFలకు త్వరగా ప్రతిస్పందించడానికి ఈ ఫీచర్ సత్వర మార్గం చూపనుంది. త్వరలోనే ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.