
SpaceX: అంతరిక్షంలో పేలిన స్టార్‌షిప్ రాకెట్.. ఫ్లోరిడాలో కనిపించిన శకలాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష రంగంలో తనదైన ముద్రవేస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) స్పేస్-X (SpaceX) సంస్థకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ (Starship Rocket) మెగా రాకెట్ విఫలమైంది.
ఈ ఘటనస్పేస్‌ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అమెరికా టెక్సాస్‌లోని బోకాచికా ప్రదేశం నుండి సాయంత్రం 5:30 గంటలకు ఈ రాకెట్ ప్రయోగం చేపట్టారు.
ప్రారంభ దశలో ఇది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా, అంతరిక్షంలో ఉన్నప్పుడే పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పేలిన రాకెట్ దృశ్యాలు
“Never give up” Elon Musk
— Tesla Owners Silicon Valley (@teslaownersSV) March 7, 2025
Starship 8 debris pic.twitter.com/NseQxyEZWP
వివరాలు
రాకెట్ పేలిన అనంతరం పెద్ద సంఖ్యలో శకలాలు
ఈ ప్రమాదంపై స్పేస్‌ఎక్స్ అధికారికంగా స్పందించింది.ఇదే విధంగా గతంలోనూ ఓ ప్రయోగం విఫలమైన విషయాన్ని గుర్తు చేసింది.
ఇటువంటి ఘటనల నుండి పాఠాలు నేర్చుకుంటామని,భవిష్యత్‌లో మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని వెల్లడించింది.
రాకెట్ పేలిన అనంతరం పెద్ద సంఖ్యలో శకలాలు కిందపడిపోయాయి.
ఫ్లోరిడా,బహామాస్ ప్రాంతాల్లో ఆకాశంలో ఈ శకలాలు మెరిసిపోతూ తారాజువ్వల్లా కనిపించాయి.
దీనివల్ల ఏయిర్ ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
జనవరిలో నిర్వహించిన మరో పునర్వినియోగ భారీ రాకెట్ 'స్టార్‌షిప్' ప్రయోగం విఫలమైంది.
ఆ రాకెట్ సాంకేతిక లోపాల కారణంగా పేలిపోయిందని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.
పేలుడు సంభవించిన అనంతరం, రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడినట్లు పేర్కొంది. అయితే, బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్ వద్దే నిలిచింది.