LOADING...
Space x: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్
టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్

Space x: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రొటీన్‌గా నిర్వహించిన స్టాటిక్ ఫైర్ టెస్ట్ సమయంలో స్పేస్‌-X కు చెందిన స్టార్‌షిప్ ఆకస్మికంగా పేలిపోయింది. ఈ పేలుడుతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలు ఆకాశాన్నంటేలా ఎగసిపడటంతో దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట కలిగించింది. ఈ విషయాన్ని టెక్సాస్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న స్పేస్‌ఎక్స్‌కు చెందిన ప్రయోగ కేంద్రంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ స్థాపించిన ఈ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ అక్కడ రొటీన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.

వివరాలు 

 స్టార్‌షిప్ 10వ టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమవుతున్న సమయంలో పేలుడు 

ఈ టెస్ట్‌ను నిర్వహించే సమయంలోనే స్టార్‌షిప్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కంపెనీకి భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్పేస్‌ఎక్స్ తెలిపింది. ఈ ప్రమాద దృశ్యాలను కంపెనీ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో షేర్ చేసింది. పరిశీలనకు అనుగుణంగా స్టార్‌షిప్ 10వ టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. అయితే సిబ్బంది, అధికారులు ముందుగానే అప్రమత్తంగా ఉండటంతో వారంతా సురక్షితంగా బయటపడగలిగారు. పైగా ఈ ఘటన చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోవడం ఆనందదాయకంగా మారింది.

వివరాలు 

రాకెట్లు మిడ్ ఎయిర్‌లోనే పేలిపోయాయి 

అప్రమత్తత కోసం ఆ ప్రాంతాలకు ఎవ్వరూ చేరొద్దని స్పేస్‌ఎక్స్ సూచనలు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా స్పేస్‌ఎక్స్ చేపట్టిన పలు ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకుండా విఫలమవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంతరిక్ష ప్రయాణాల సమయంలోనూ కొన్ని రాకెట్లు మిడ్ ఎయిర్‌లోనే పేలిపోవడం సంభవించింది. తాజాగా టెస్టింగ్ దశలోనే పేలుడు సంభవించడం కలవరానికి గురి చేసింది. అయితే ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊరట పీల్చుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్