LOADING...
Spotify: స్పాటిఫై యాప్ ఐకాన్ మార్పు తాత్కాలికమే.. త్వరలో పాత లోగో రీఎంట్రీ
స్పాటిఫై యాప్ ఐకాన్ మార్పు తాత్కాలికమే.. త్వరలో పాత లోగో రీఎంట్రీ

Spotify: స్పాటిఫై యాప్ ఐకాన్ మార్పు తాత్కాలికమే.. త్వరలో పాత లోగో రీఎంట్రీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన స్పాటిఫై ఇటీవల తన యాప్ ఐకాన్‌ను మార్చిన విషయం తెలిసిందే. సాధారణంగా కనిపించే గ్రీన్ కలర్ లోగో స్థానంలో డిస్కో బాల్ తరహా కొత్త ఐకాన్‌ను తీసుకురావడంతో యూజర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కంపెనీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక మార్పు చేసింది. అయితే ఈ కొత్త లోగో శాశ్వతమా అనే సందేహంతో పలువురు సోషల్ మీడియాలో స్పందించారు. యూజర్లలో ఏర్పడిన గందరగోళంపై స్పందించిన స్పాటిఫై.. డిస్కో బాల్ ఐకాన్ తాత్కాలికమేనని స్పష్టం చేసింది. ఈ వారం చివర్లో మళ్లీ పాత గ్రీన్ లోగోనే యాప్‌లో కనిపిస్తుందని తెలిపింది. కొత్త డిజైన్ నచ్చని యూజర్లకు ఇది ఊరటనిచ్చే వార్తగా మారింది.

వివరాలు 

బ్రాండింగ్‌లో కంపెనీలు కొత్త ప్రయోగాలు

ప్రత్యేక సందర్భాల్లో యాప్ ఐకాన్‌లను మార్చడం కొత్త విషయం కాదు. గతంలో ఇన్‌స్టాగ్రామ్ కూడా ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా యూజర్లకు వివిధ ఐకాన్ ఆప్షన్‌లను అందించింది. అయితే అవి కూడా కొంతకాలానికే పరిమితమయ్యాయి. స్పాటిఫై తాజా మార్పుతో బ్రాండింగ్‌లో కంపెనీలు కొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయన్న విషయం మరోసారి స్పష్టమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాత ఐకాన్ ఈ వారం తిరిగి వస్తుంది 

Advertisement