LOADING...
 Sunita Williams : సాంకేతిక లోపంతో ఖాళీగా భూమికి చేరుకున్న స్టార్‌లైనర్‌.. సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా 
సాంకేతిక లోపంతో ఖాళీగా భూమికి చేరుకున్న స్టార్‌లైనర్‌.. సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా

 Sunita Williams : సాంకేతిక లోపంతో ఖాళీగా భూమికి చేరుకున్న స్టార్‌లైనర్‌.. సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష రంగంలో ప్రముఖ సంస్థ బోయింగ్‌ చేపట్టిన తొలి మానవసహిత ప్రయోగం వివాదాస్పదంగా ముగిసింది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు తలెత్తింది. దీంతో వ్యోమగాములు భూమికి పైకి తిరిగి రాలేదు. ఈ సమస్యల కారణంగా ఖాళీ క్యాప్సుల్‌ను మాత్రమే భూమిపైకి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Details

 స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో  సాంకేతిక సమస్యలు

నాసా తో కలిసి బోయింగ్ నిర్వహించిన ఈ క్రూ ఫ్లైట్‌ టెస్ట్ జూన్ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 14న తిరుగు ప్రయాణం కావాల్సిన సునీతా, విల్‌మోర్, స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో తలెత్తిన థ్రస్టర్‌ లోపాలు, హీలియం లీకేజీ వంటి సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే నిలిచిపోయారు. సాంకేతిక సమస్యలు సవరించాక, వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి బోయింగ్‌ సిద్ధమైందని చెప్పినా, నాసా ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో వ్యోమనౌక ఖాళీగా భూమికి చేరుకుంది.