WhatsApp: వాట్సాప్ ఛానెల్స్‌లో సబ్‌స్క్రిప్షన్ సేవలు.. ఇక ప్రత్యేక కంటెంట్ కోసం చెల్లింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. 'చానల్ సబ్‌స్క్రిప్షన్స్' (Channel Subscriptions) పేరుతో రాబోతున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఇష్టమైన చానెల్‌లను సబ్‌స్క్రైబ్ చేసుకుని ప్రత్యేక కంటెంట్‌ను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉండగా, ఇంకా బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రాలేదు.
వివరాలు
ఛానెల్ క్రియేటర్లకు ఆదాయ వనరు
ఈ కొత్త ఫీచర్‌తో చానెల్ నిర్వాహకులు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసుకునే అవకాశం పొందనున్నారు. అంటే, చానెల్‌లో ప్రత్యేక కంటెంట్ కోసం యూజర్ల నుంచి చందా (subscription fee) తీసుకునే విధానాన్ని అమలు చేయవచ్చు. దీని ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్ ఆధారంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
సబ్‌స్క్రైబర్ సంఖ్య కనిపించేలా ఏర్పాటు
ఈ ఫీచర్‌లో భాగంగా, ఒక చానెల్‌కు ఎంతమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారో కూడా యూజర్లకు చూపించనున్నారు. దీని వల్ల యూజర్లు ఆ చానెల్ ఎంత ప్రజాదరణ పొందిందో అంచనా వేసుకుని, సబ్‌స్క్రైబ్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు సబ్‌స్క్రిప్షన్ సెటప్ సులభం భవిష్యత్తులో వచ్చే అప్డేట్‌లో చానెల్ క్రియేటర్లు చాలా సులభంగా సబ్‌స్క్రిప్షన్ వ్యవస్థను సెటప్ చేసుకోవచ్చు. వారు తమ కంటెంట్‌కు ఎంత చార్జ్ చేయాలనుకుంటున్నారో స్వయంగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. చానెల్‌లో ఫ్రీ కంటెంట్, చెల్లింపు కంటెంట్‌ను వేర్వేరుగా ఫిల్టర్ ద్వారా చూపించేలా కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో యూజర్లకు ఎలాంటి గందరగోళం ఉండదు.
వివరాలు
ఫ్రీ కంటెంట్ కొనసాగుతుంది
చానెల్ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఐచ్చికం మాత్రమే. యూజర్లు తమకు అవసరమైతేనే చెల్లించి ప్రత్యేక కంటెంట్‌ను పొందవచ్చు. ఉచితంగా అందించే కంటెంట్ మాత్రం ఎప్పటిలాగే అందరికీ అందుబాటులోనే ఉంటుంది. నిబంధనలు తప్పనిసరి చెల్లింపు కంటెంట్ అయినప్పటికీ, వాట్సాప్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అక్రమ, హానికర లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను చానెల్‌లో పోస్ట్ చేయడానికి అనుమతి ఉండదు. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, వాట్సాప్ చానెల్‌ల వినియోగం మరింత పెరగడంతో పాటు క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది.