Sun : సూర్యుడి గురించి షాకింగ్ నిజాలు… 70 ఏళ్లపాటు చీకటి తప్పదా? శాస్త్రవేత్తల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యుడు ఒక్కసారిగా మారిపోతాడని, అది కూడా దాదాపు 70 ఏళ్ల పాటు చీకటిమయం అవుతాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిణామంతో భూమి చీకటిమయం ఎప్పుడైనా అవ్వొచ్చని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం సూర్యుడు 11 సంవత్సరాల చక్రంలో గరిష్ఠ స్థాయిలో (సోలార్ మాక్సిమమ్) ఉన్నాడు. ఈ చక్రంలో గరిష్ఠంతో పాటు కనిష్ఠ స్థాయి కూడా ఉంటుంది. అయితే 1645 నుంచి 1715 వరకు సూర్యుడు అసాధారణంగా "గ్రాండ్ సోలార్ మినిమమ్" దశలోకి వెళ్లాడు. దీనినే "మౌండర్ మినిమమ్" అని పిలుస్తారు. ఈ కాలాన్ని ఇంగ్లండ్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ వాల్టర్ మౌండర్ గుర్తించినందుకే ఆయన పేరుతో ఈ పేరు వచ్చింది.
వివరాలు
సూర్యునిపై సన్ స్పాట్స్..
అయితే ఈ మౌండర్ మినిమమ్ ఎందుకు వచ్చిందన్నది చాలా కాలంగా మిస్టరీగానే ఉంది. ఈ గుట్టు విప్పేందుకు జపాన్‌లోని నాగోయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. 1607లో జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త జోహన్నెస్ కేప్లర్ "కెమెరా ఆబ్స్క్యూరా" పద్ధతితో సూర్యునిపై కనిపించిన సన్‌స్పాట్స్‌ను గమనించాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆయన చేసిన ఆ పరిశీలనలను మళ్లీ విశ్లేషించి, సూర్యుడు ఎందుకు 70 సంవత్సరాలు అలా మారాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. "ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్"లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, 1607లో కేప్లర్ గీసిన చిత్రాలు సూర్యుని చరిత్రలో ఉన్న పెద్ద మిస్టరీకి సమాధానం చెబుతున్నాయి.
వివరాలు
ఆ నల్లటి మచ్చలు ఎందుకొచ్చాయి?
సూర్యుడు మసకబారిన సమయంలో "లిటిల్ ఐస్ ఏజ్" అనే తీవ్ర చలి కాలం యూరప్‌లో కనిపించింది. మౌండర్ మినిమమ్ సమయంలో సన్‌స్పాట్స్ దాదాపు పూర్తిగా కనిపించకుండా పోయాయి. 1607లో సూర్యుణ్ని పరిశీలించిన కేప్లర్ మొదట ఒక నల్ల మచ్చను గమనించి, దాన్ని "మెర్క్యూరీ ట్రాన్సిట్"గా భావించాడు. ఆయన ఉపయోగించిన పిన్హోల్ ప్రొజెక్టర్ ద్వారా తీసిన ఆ చిత్రం శాస్త్రీయ పరికరంతో తీసిన తొలి సన్‌స్పాట్ డ్రాయింగ్‌గా గుర్తింపు పొందింది. శాస్త్రవేత్తలు స్పోరర్ చట్టం ఆధారంగా ఆ సన్‌స్పాట్స్ స్థానం విశ్లేషించారు. ఈ చట్టం ప్రకారం 11 సంవత్సరాల చక్రంలో సన్‌స్పాట్స్ ధృవాల నుంచి భూమధ్యరేఖ వైపు కదులుతాయి. దీంతో 1607లో సూర్యుడు ఒక చక్రం చివరి దశలో ఉన్నాడని వారు నిర్ధారించారు.
వివరాలు
ఆ మార్పును గమనించిన శాస్త్రవేత్తలు..
ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మౌండర్ మినిమమ్‌కు ముందు సూర్యుని చక్రాలు సాధారణంగానే ఉన్నాయా లేదా ఏవైనా అసాధారణ సంకేతాలు కనిపించాయా అన్నది శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకున్నారు. కేప్లర్ డేటా ప్రకారం 1607 ప్రాంతంలో ముగిసిన చక్రం పూర్తిగా సాధారణ కాలవ్యవధిలోనే జరిగింది. ఈ విషయాన్ని రచయిత హిసాషి హయకావా కూడా స్పష్టం చేశారు. సూర్యుడి ప్రవర్తనలో పెద్ద మార్పులు లేకుండానే, సాధారణ చక్రాల నుంచి ఒక్కసారిగా "గ్రాండ్ సోలార్ మినిమమ్" దశలోకి మారిపోయిందని ఆయన తెలిపారు.
వివరాలు
భూమిపై ప్రభావం చూపనున్నాయా?
తాజాగా ఒక పరిశోధన కీలక అంశాన్ని వెల్లడించింది. సూర్యుడు పూర్తిగా సాధారణంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, ఒక్కసారిగా దీర్ఘకాల "హైబర్నేషన్" దశలోకి వెళ్లే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. అంటే ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇలాంటి మార్పులు సంభవించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు భూమిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.