Sunita Williams: ఆరు నెలల పాటు ఐఎస్ఎస్‌లోనే సునీతా విలియమ్స్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుల్ విల్ మౌర్‌లు జూన్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో సేవలు అందించడానికి వెళ్లి అనూహ్యంగా చిక్కుకున్నారు. తాజాగా వారు మరో ఆరు నెలల పాటు అక్కడే ఉంటారని అమెరికి అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ద్వారా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది
మరిన్ని పరిశోధనలు చేయనున్న సునీతా, విల్ మోర్
దీంతో స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఖాళీగానే భూమికి చేరుకోనుంది. ఈ ప్రయాణంలో క్యాప్స్యూల్ పనితీరును నాసా, బోయింగ్ సంస్థ పరిశీలించనున్నాయి. వచ్చే ఫిబ్రవరి వరకు సునీతా, విల్‌మోర్‌లు స్పేస్ స్టేషన్‌లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నట్లు తెలిసింది.