
Telegram Update: టెలిగ్రామ్ కొత్త అప్డేట్ విడుదల.. యూజర్ల కోసం డైరెక్ట్ మెసేజ్, HD ఫోటో ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త అప్డేట్‌ను విడుదల చేసింది. తాజాగా v11.12.0 వెర్షన్‌లో అనేక ఆధునిక, సౌలభ్యమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఈ అప్డేట్‌తో చానెల్ యాజమానులతో నేరుగా మెసేజ్ పంపే అవకాశం, వాయిస్ మెసేజ్ ట్రిమ్మింగ్, హై డెఫినిషన్ ఫోటోలు పంపే విధానం వంటి కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇక ఈ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి
Details
చానెల్ యాజమానులకు డైరెక్ట్ మెసేజ్‌లు
ఈ కొత్త ఫీచర్‌తో, యూజర్లు ఇకపై చానెల్ అడ్మిన్లు లేదా ఓనర్లకు నేరుగా మెసేజ్‌లు పంపవచ్చు.
మొబైల్ నంబర్ షేర్ చేయకుండానే ఈ కమ్యూనికేషన్ జరగడం వల్ల ప్రైవసీ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అడ్మిన్లకు వచ్చిన మెసేజ్‌లు ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌లో కన్పిస్తాయి.
చానెల్ మేసేజ్ బబుల్‌లోని ఐకాన్‌ను టాప్ చేసి మెసేజ్ పంపవచ్చు.
ఈ సదుపాయం వినియోగించాలంటే Channel Settings → Direct Messages విభాగంలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి.
Details
గ్రూప్ టాపిక్స్‌కి ట్యాబ్ లేఅవుట్
గ్రూప్ చర్చలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టెలిగ్రామ్ టాపిక్స్‌కి ట్యాబ్ లేఅవుట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
టాపిక్స్ మధ్య సులభంగా స్విచ్ అయ్యేలా టాప్ లేదా సైడ్ బార్ ద్వారా ట్యాబ్‌లను యాక్సెస్ చేయవచ్చు.
దీనిని Group Settings → Topics సెక్షన్‌లో యాక్టివేట్ చేయవచ్చు.
వాయిస్ మెసేజ్ ట్రిమ్మింగ్
వాయిస్ మెసేజ్ రికార్డింగ్ సమయంలో చిన్న తప్పిదం జరిగినా, మళ్లీ రికార్డ్ చేయాల్సిన అవసరం ఇకలేదు.
ఈ ఫీచర్‌తో మెసేజ్ ప్రారంభం, ముగింపులో ముఖ్యమైన భాగాలను ట్రిమ్ చేయొచ్చు. రికార్డింగ్ సమయంలో స్వైప్ అప్ చేసి లాక్ చేసిన తర్వాత ట్రిమ్మింగ్ ఆప్షన్ యాక్టివ్ అవుతుంది.
మైక్రోఫోన్ ఐకాన్‌ను మళ్లీ టాప్ చేస్తే మరిన్ని సెగ్మెంట్లు జోడించవచ్చు.
Details
హై డెఫినిషన్ ఫోటోలు పంపే సదుపాయం
ఇప్పటివరకు టెలిగ్రామ్‌లో పిక్చర్ క్వాలిటీ పరిమితంగా ఉండేది. కానీ ఈ అప్డేట్ తర్వాత నాలుగు రెట్లు ఎక్కువ పిక్సెల్ క్వాలిటీతో, 0.5 MBకే పరిమితమైన ఫైల్ సైజుతో ఫోటోలు పంపే వీలు ఉంది.
ఫోటో ఎడిటర్లో SD బటన్‌ను టాప్ చేసి HDకి మార్చవచ్చు లేదా Attachment మెనూలో Send in High Quality ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఐఓఎస్‌లో స్టోరీస్‌కి డైరెక్ట్ షేర్
iPhone వినియోగదారుల కోసం, ఫొటోస్ యాప్ లాంటి అప్లికేషన్ల నుండి Telegram Storiesకి డైరెక్ట్ షేర్ చేసే సదుపాయం ప్రారంభమైంది. ఇది iOS System Share Sheet ద్వారా సహాయపడుతుంది.
Details
పొల్స్‌లో 12 ఆప్షన్లు
ఇప్పటి నుంచి Telegram pollsలో గరిష్టంగా 12 ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. ఫలితాలను Saved Messagesకి ఫార్వర్డ్ చేయడం ద్వారా భద్రపరచొచ్చు. అలాగే ఇతర చాట్స్‌కి షేర్ చేయవచ్చు.
ఈ ఫీచర్లు ప్రస్తుతం Android, iOS ప్లాట్‌ఫారమ్‌లపై v11.12.0 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.
Android యూజర్లు దీన్ని [telegram.org/android](https://telegram.org/android) లేదా Google Play Store ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ అప్డేట్‌తో టెలిగ్రామ్ వినియోగదారుల అనుభవం మరింత మెరుగ్గా, సురక్షితంగా మారనుంది.