LOADING...
OnePlus 12: ఎంతగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12 లాంచ్ డేట్ ఫిక్స్ ..  ఎప్పుడంటే?
ఎంతగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12 లాంచ్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే?

OnePlus 12: ఎంతగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12 లాంచ్ డేట్ ఫిక్స్ ..  ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12న ఫోన్ వచ్చేసింది. చైనాలో డిసెంబర్ 4న జరగనున్న ఈవెంట్‌లో వన్ ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3ని అదే రోజున లాంచ్ చేసే అవకాశం ఉంది. వన్ ప్లస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను రిలీవ్ చేస్తోంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 చిప్ సెట్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సోని సరికొత్త ఎల్ వైటీ-టీ808 ప్రైమరీ, 48 ఎంపీ అల్ట్రావైడ్, 64 ఎంపీ ఓమ్నీవిజన్ ఓవీ 64బీ టెలిఫోటో కెమెరా రేర్‌‌తో పాటు ఫ్రెంట్‌లో 32 ఎంపీ కెమెరా రానున్నట్లు తెలిసింది.

Details

ధర, ఫీచర్స్ ని వెల్లడించిన సంస్థ

ఈ వన్ ప్లస్ 12లో 6.82 ఇంచ్ అమోలెట్ డిస్ ప్లే, ఇన్నోవేటివ్ ఓరియెంట్ స్క్రీన్ అనే ఫీచర్ ను నూతనంగా అమర్చినట్లు సమాచారం. ఇది 16జీబీ ర్యామ్-1టీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంటుందని తెలుస్తోంది. 5400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వయర్డ్, 50 వాట్ వయర్ లెస్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తోంది. ఈ మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్ 14పై పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి ఫీచర్స్, ధర లాంచ్ సమయంలో తెలిసే అవకాశం ఉంది.