Page Loader
Google: మూడు రోజులు లాక్ అయితే ఫోన్‌ రీస్టార్ట్‌.. ఆ ఫీచర్‌తో భద్రత పెంపు!
మూడు రోజులు లాక్ అయితే ఫోన్‌ రీస్టార్ట్‌.. ఆ ఫీచర్‌తో భద్రత పెంపు!

Google: మూడు రోజులు లాక్ అయితే ఫోన్‌ రీస్టార్ట్‌.. ఆ ఫీచర్‌తో భద్రత పెంపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల భద్రతను మెరుగుపరిచేందుకు గూగుల్‌ మరో కీలక అడుగు వేసింది. గూగుల్ ప్లే సర్వీసెస్ తాజా వెర్షన్ 25.14లో ఒక కొత్త భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఓ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నిరంతరం మూడు రోజుల పాటు లాక్‌ అయ్యి ఉంటే, అది ఆటోమేటిక్‌గా రీస్టార్ట్‌ అవుతుంది. ఈ విధానం ద్వారా అనధికారిక యాక్సెస్‌ను సమర్థంగా నివారించవచ్చని గూగుల్ పేర్కొంది. ఫోన్‌ రీస్టార్ట్‌ అయిన తర్వాత వినియోగదారుడు పాస్‌వర్డ్‌ లేదా పిన్‌ ఎంటర్‌ చేసిన తర్వాత మాత్రమే డివైస్‌ను అన్‌లాక్‌ చేయడం సాధ్యమవుతుంది.

Details

త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకి అందుబాటులోకి

ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి బయోమెట్రిక్‌ విధానాలు పనిచేయవు. ఈ మార్పు ముఖ్యంగా ట్యాబ్లెట్‌ వాడేవారికి, లేదా రెండు ఫోన్లు వాడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరలోనే ఇది అన్ని ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ భద్రతను మరింత బలపరచడంలో సహాయకారిగా మారనుంది.