Google Pixel 9 Pro Fold: ఇండియాలో 'గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' లాంచ్.. ధర ఎంతంటే?
కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 4న గూగుల్ పిక్సెల్ 9 ఫ్రో ఫోల్డ్ రిలీజ్ కానుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్‌లైన్‌లో ఈ ఫోన్ లభించనుంది. పిక్సెల్ సిరీస్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడం ఇదే మొదటిసారి. పిక్సెల్ 9 సిరీస్ హ్యాండ్‌సెట్‌లతో పాటు ఆగస్టు 13న ఈ ఫోల్డబుల్ పరికరాన్ని ఆవిష్కరించనుంది. దీని ధర రూ.1,72,999గా నిర్ణయించారు. ఇది 256GB నిల్వతో మాత్రమే భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 8.0-అంగుళాల OLED అంతర్గత డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఆన్ లైన్ లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్
ఫోన్‌లో ఉన్న 6.3-అంగుళాల కవర్ స్క్రీన్ కూడా ఇదే రిఫ్రెష్ రేట్, ప్రకాశం స్థాయిని కలిగి ఉంటుంది. పరికరం టెన్సర్ G4 ప్రాసెసర్‌తో శక్తిని పొందుతుంది. ఇది ఇతర Pixel 9 మోడల్‌లలో కూడా ఉంటుంది. కెమెరా సెటప్‌లో 48MP ప్రధాన కెమెరా, 10.5MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. గూగుల్ ఈ సంవత్సరం నాలుగు పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. పిక్సెల్ వాచ్ 3 సిరీస్, పిక్సెల్ బడ్స్ ప్రో 2 కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం పిక్సెల్ 9, పిక్సెల్ 9ప్రో ఎక్స్ఎల్ మాత్రమే ఫ్లిప్ కార్ట్, క్రోమ్, రిలయెన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉన్నాయి.