మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్
టెక్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఒక స్త్రీ, స్త్రీల కోసం నిర్మించిన సామ్రాజ్యం నేడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది. ఇడా టిన్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో మహిళల అందరికీ మార్గదర్శకురాలు అయ్యారు. ఆమె 2016లో ఫెమ్‌టెక్ పేరుతో ప్రారంభించిన సంస్థ నేడు ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా మారింది. ఇది మహిళలను మాత్రమే ఉపయోగపడే లేదా పెద్ద సంఖ్యలో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అందించడంలో సహాయపడే అన్ని రకాల సాంకేతిక ఉత్పత్తులు, ఆవిష్కరణలను అందిస్తుంది.
బిలియన్-కోట్ల వ్యాపారానికి ఎదిగిన మొదటి రుతుక్రమం ట్రాకింగ్ యాప్
FemTech ప్రారంభానికి ముందు రుతుచక్రాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడే యాప్‌ను కనుగొన్నారు. అలా కొన్నేళ్ల క్రితం క్లూ అనే అప్లికేషన్‌ను ప్రారంభించి భారీ విప్లవాన్నే తీసుకొచ్చారు టిన్. మహిళల ఆరోగ్య సాంకేతిక ఉత్పత్తులలో, రుతుక్రమాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడే యాప్‌లు ప్రస్తుతం జనాదరణ పొందుతున్నాయి. కోటి మందికి పైగా మహిళలు ఈ యాప్‌ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దీన్ని రూపొందించిన తర్వాత, ఇడా టిన్ మహిళల కోసం అన్ని ఆరోగ్య, సంరక్షణ సేవలు, ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలని నిర్ణయించుకుని FemTechని స్థాపించారు.