బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం
బడ్జెట్ 2023లో మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్(Mahila Samman Saving Certificate)పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కొత్త పథకాన్ని తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో రూ.2లక్షల వరకు పొదువు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని 7.5శాతం స్థిర వడ్డీ రేటు ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఆడపడుచుల కోసం 'మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్' పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ పరిమితి పెంపు
బడ్జెట్ 2023లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో కీలక ప్రకటన చేశారు. సీనియర్ సిటిజన్స్ శుభవార్త చెప్పారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ స్థాయిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల వెల్లడించారు. మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితిని సింగిల్ ఖాతాకు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతాకు రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల ప్రకటించారు.