Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌లో హైలెట్స్ ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇది 11వ వార్షిక బడ్జెట్ కాగా, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు ఇది 6వది. 7అంశాల ప్రాతిదికతన బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను 7శాతం వృద్ధి కేంద్రం అంచనా వేసింది. వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం 10 లక్షల కోట్లు పీఎం హౌసింగ్ స్కీమ్ కోసం రూ. 79,000 కోట్ల కేటాయింపులు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు రూ.2 లక్షల కోట్లు 157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
రైల్వే కోసం రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
33% శాతం నిధులను కేటాయించడం ద్వారా మూలధన పెట్టుబడులు రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్డీ లేని 50 ఏళ్ల రుణాల కేటాయింపును మరో ఏడాది పొడిగింపు మౌలిక సదుపాయాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి, 1.3 లక్షల కోట్లు కేటాయింపు రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.75వేల కోట్లు పాత వాహనాల రీప్లేస్‌మెంట్ విధానాన్ని ప్రకటించిన కేంద్రం రైల్వే కోసం రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం విద్యార్థుల కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడిన ఈపీఎఫ్ఓ సభ్యత్వం రెట్టింపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఉచిత ఆహార ధాన్యం పథకం అమలు