LOADING...
ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా
బడ్జెట్ లో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది

ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 01, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ధిక అభివృద్ది దిశగా దేశం దూసుకుపోవాలంటే విద్యారంగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటప్పుడు బడ్జెట్ లో ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్‌లో డిజిటల్ యూనివర్సిటీ(Digital University), వన్-క్లాస్-వన్ ఛానల్, PM గతి శక్తి మాస్టర్ ప్లాన్, టెలి-మెంటల్ హెల్త్ వంటి వాటిని ప్రభుత్వం ప్రకటించింది. 2022 బడ్జెట్ లో విద్యారంగానికి అంతకు ముందు ఏడాది విద్యా బడ్జెట్ కేటాయింపు 2021లో రూ.93,223 కోట్లుతో పోలిస్తే రూ.11,054 కోట్లు ఎక్కువ చేసి రూ.1,04,278 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రధాన ఆదాయం, వ్యయం ప్రయివేట్ సంస్థలదే, పైగా ఇప్పుడు భారీ డిమాండ్ కూడా ఏర్పడింది.

బడ్జెట్

అడ్వాన్స్ లెర్నింగ్ కోసం ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరం

సరైన వనరుల కేటాయించి సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా భారతదేశం NEP 2020 లక్ష్యాలను సాధించచ్చు. ప్రాధమిక స్థాయిలో విద్యా వ్యవస్థలో మార్పు అనివార్యమని, అడ్వాన్స్ టెక్నాలజీ సేవలు అందించే మానవ వనరుల అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అడ్వాన్స్ లెర్నింగ్ కోసం ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని విద్యా రంగం అభివృద్దికి చేయూతనివ్వాలని కోరుతున్నారు. ఉచిత విద్యను అందించడం, పాఠశాల మౌలిక సదుపాయాలను పెంచడం, స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్‌లను ఏర్పాటు చేయడం, టెక్నాలజీపై అవగాహన కల్పించడం వంటివి నెరవేర్చాలి . సిట్యుయేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ (SLE), వృత్తి/ఇంటర్న్‌షిప్ (హార్డ్ స్కిల్స్), టాలెంట్ పైప్‌లైన్‌లలో పెట్టుబడి ప్రోత్సాహాలు అందిస్తే మరింత అభివృద్ది సాధ్యం.