బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా?
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న అంచనాల నేపథ్యంలో భారతదేశ వృద్ధిని కొనసాగించే చర్యలను 2023 బడ్జెట్‌లో ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని పెంచడంలో ప్రైవేట్ వినియోగం పెద్ద పాత్ర పోషిస్తుందని అంచనా వేయబడినందున, ప్రభుత్వం పన్నుల నుంచి కొంత ఉపశమనం కల్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో మార్పులు ఉంటాయని ఇప్పటికే నివేదికలు సూచించాయి. పాత పన్ను విధానంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయా? అంటే, అది అసంభవమనే చెప్పాలి.
పాత పన్ను విధానంలో కొన్ని సంవత్సరాలుగా చాలా తక్కువ మార్పులను మాత్రమే చేశారు. ఈ క్రమంలో పన్ను విధానంలో మార్పుల కోసం చెల్లింపుదారులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్ 2023
దిగువ, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులపై దృష్టి సారించే అవకాశం
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం, సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80టీటీఏ కింద అధిక తగ్గింపు పరిమితులు వంటి కొన్ని మార్పులు పరిశీలించాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర బడ్జెట్ 2023-24లో పన్ను స్లాబ్‌లను పునరుద్ధరించాలని, పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు Tax2win సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ కూడా వెల్లడించారు.
గత కొన్ని సంవత్సరాలలో జీవన వ్యయం పెరిగిందని, 2023 బడ్జెట్ దిగువ, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులపై దృష్టి సారించే అవకాశం ఉందని అభిషేక్ సోని ఆశాభావం వ్యక్తం చేశారు. వారికి పన్ను మినహాయింపుల ఇవ్వడం వల్ల వారికి భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణకు దోహద పడుతుందని పేర్కొన్నారు.