Microsoft: మైక్రోసాఫ్ట్‌కు మరో సమస్య.. ఈసారి 366 సేవలకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ సేవలకు మళ్లీ అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాము యాక్సెస్ సమస్యలు, బహుళ మైక్రోసాఫ్ట్ 365 సేవలు, ఫీచర్ల పనితీరు గురించి పరిశోధిస్తున్నామని టెక్ దిగ్గజం Xఖాతాలో పేర్కొంది.
ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు
ఈ ఘటన గురించి మరింత సమాచారం కోసం అడ్మిన్ సెంటర్‌లోనిMO842351ని వీక్షించాల్సిందిగా వినియోగదారులకు తెలిపారు. మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ ఇంట్యూన్, ఎంట్రా, పవర్ ప్లాట్‌ఫారమ్, పవర్ బిఐలను ప్రభావితం చేస్తుంది. నివేదికల ప్రకారం షేర్‌పాయింట్ ఆన్‌లైన్, వన్‌డ్రైవ్ ఫర్ బిజినెస్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఎక్స్ఛేంజ్ వంటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతం తాము అజూర్ సేవలను ప్రభావితం చేసే సమస్యను పరిశీలిస్తున్నామని పేర్కొంది.