Page Loader
Galaxy Tab S9: 3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్‌ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే
3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్‌ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే

Galaxy Tab S9: 3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్‌ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే

వ్రాసిన వారు Stalin
Jul 26, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ శాంసంగ్ బుధవారం తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్9(Galaxy Tab S9) సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు వేరియంట్ల(ఎస్9, ఎస్9 ప్లస్, ఎస్9 అల్ట్రా)ను తీసుకొచ్చింది. శాంసంగ్ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్లు టాబ్లెట్ ఆవిష్కరణలో సరికొత్త మైలురాళ్లుగా సంస్థ పేర్కొంది. వినియోగదారులు లీనమయ్యేలా, మంచి అనుభూతిని కలిగించేలా అధునాతన హంగులతో ఎస్9 సిరిస్‌ను తీసుకొచ్చినట్లు శాంసంగ్ తెలిపింది. పని చేయడానికి, సులభంగా కనెక్ట్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీగా తాము నూతన వేరియంట్లను తయారు చేసినట్లు వెల్లడించింది.

శాంసంగ్

ట్యాబ్ ఎస్9 సిరీస్ ఫీచర్లు, ధర

ఎస్9 వేరియంట్ 11-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీని ధర ధర 799 డాలర్లుగా నిర్ణయించారు. ఎస్9 ప్లస్ వేరియంట్ 12.4-అంగుళాలు ఉంటుంది. దీని ధరను 999 డాలర్లుగా వెల్లడించారు. ఎస్9 అల్ట్రా వేరియంట్ 14.6-అంగుళాల స్క్రీన్‌‌ వస్తోంది. ధర 1999 డాలర్లుగా ప్రకటించారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్9 టాబ్లెట్‌లు అప్‌గ్రేడ్ చేసిన డిస్‌ప్లేలు, స్పీకర్‌లు వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తాయని సంస్థ పేర్కొంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ మోడల్స్ నీరు, దుమ్ముకు తట్టుకునేలా ఈ సిరీస్‌ను తీర్చి దిద్దారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఈ సరీస్ ప్రత్యేకత.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఎస్9 ట్యాబ్ సిరీస్ లాంచ్