Page Loader
Samsung Galaxy Unpacked Event: నేడేశాంసంగ్ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌.. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి.. అంచనాలు
నేడే శాంసంగ్ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌.. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి.. అంచనాలు

Samsung Galaxy Unpacked Event: నేడేశాంసంగ్ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌.. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి.. అంచనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు సిద్ధమైంది. బుధవారం రాత్రి గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ (Galaxy Unpacked Event) నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో ఎస్‌25 సిరీస్‌లో కొత్త ఫోన్లు లాంచ్‌ చేయబోతున్నారు. అలాగే, ఈ ఈవెంట్‌లో ఎస్‌25 స్లిమ్‌ పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు, ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ సంభందించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు 

లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి

శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ కాలిఫోర్నియాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. అంటే, భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30కి ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌ను శాంసంగ్‌ సహా వివిధ యూట్యూబ్‌ ఛానెళ్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ కార్యక్రమంలో శాంసంగ్‌ ఎస్‌25 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేయనుంది. అవి గెలాక్సీ ఎస్‌25, గెలాక్సీ ఎస్‌25+, గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా పేర్లతో లాంచ్‌ అవుతాయి. ఈ మూడు ఫోన్లలో క్వాల్‌కామ్‌ లేటెస్ట్‌ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించబోతున్నారు.

వివరాలు 

ఎస్‌ 25 సిరీస్‌ ఫోన్ల ధరలు ఇవేనా?

ప్రీబుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.2,000 చెల్లించి హ్యాండ్‌సెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఎస్‌25 మోడల్‌ 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రాబోతుందని సమాచారం. దీని ప్రారంభ ధర రూ.81,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గెలాక్సీ ఎస్‌25+ ధర ₹1 లక్ష చుట్టూ ఉండొచ్చని సమాచారం. అలాగే, అల్ట్రావేరియంట్‌ ధర ₹1.30 లక్షల చుట్టూ ఉండొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూడు ఫోన్లతో పాటు, స్లిమ్‌ మోడల్‌ను కూడా శాంసంగ్‌ విడుదల చేసే అవకాశం ఉందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో పూర్తి వివరాలు వెలుగు చూడబోతున్నాయి.