Chandra Grahanam: చంద్రోదయం సమయానికి గ్రహణ విముక్తి దశ.. 22 నిమిషాలే కనిపించిన చంద్రగ్రహణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన సంపూర్ణ చంద్రగ్రహణంకు సంబంధించిన దృశ్యాలు ఇవి. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ప్రధాన భాగం మధ్యాహ్నానికే పూర్తయిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా-హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 2.13 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు ముగిసింది. అయితే హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6.22 గంటలకు చంద్రోదయం జరిగింది. ఆ సమయానికి చంద్రుడు ఇప్పటికే గ్రహణ విముక్తి దశలోకి ప్రవేశించాడని తెలిపారు.
వివరాలు
22 నిమిషాలపాటు పాక్షిక చంద్రగ్రహణం
దీంతో సాయంత్రం 6.22 నుంచి 6.48 గంటల వరకు సుమారు 22 నిమిషాలపాటు మాత్రమే పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది అని చెప్పారు. చంద్రోదయం సమయంలో చంద్రుడు క్షితిజానికి (హారిజన్) కేవలం 1 నుంచి 5 డిగ్రీల ఎత్తులో మాత్రమే ఉన్నందున, జాగ్రత్తగా గమనించిన వారికి మాత్రమే ఈ గ్రహణ దృశ్యం స్పష్టంగా కనిపించిందని ఆయన వివరించారు.