Chandragrahanam 2026 : రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. గ్రహణ ప్రభావం అధికంగా ఉండే సమయం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజైన మార్చి 3, మంగళవారం ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం సంభవించనుంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఇది చివరి గ్రహణంగా భావిస్తున్నారు. ఇది కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంలో మాత్రం చివరి దశలో సుమారు 27 నిమిషాల పాటు పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయాలు, మధ్యకాలం, పట్టు-విడుపు వేళలు ఇలా ఉన్నాయి.
Details
గ్రహణ విశేషాలు
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహ రాశిలో పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలో సంభవిస్తుంది. మార్చి 3 మధ్యాహ్నం 3:21 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మొత్తం గ్రహణ వ్యవధి 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. ఈ కాలంలో గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు.
Details
ముఖ్య సమయాలు
సూతకాల ప్రారంభం: మార్చి 3 ఉదయం 6:22 గంటలకు గ్రహణ స్పర్శకాలం (ప్రారంభం): మధ్యాహ్నం 3:21 గంటలకు ఉన్మీలన కాలం (మధ్య దశ ప్రారంభం): సాయంత్రం 5:02 గంటలకు - ప్రభావం తీవ్రతరం కావడం మొదలు గ్రహణ మధ్యకాలం: సాయంత్రం 5:32 గంటలకు - అత్యంత ప్రభావం ఉన్న సమయం నిమీలన కాలం (పూర్తిగా పట్టే సమయం): సాయంత్రం 5:48 గంటలకు - ప్రభావం అధికంగా ఉంటుంది గ్రహణ మోక్షకాలం (విడవడం ప్రారంభం): సాయంత్రం 6:12 గంటలకు - ప్రభావం తగ్గడం ప్రారంభం అద్యంత పుణ్యకాలం (పూర్తి ముగింపు): సాయంత్రం 6:48 గంటలకు - గ్రహణం పూర్తిగా ముగుస్తుంది
Details
భారతదేశంలో దర్శనం
హైదరాబాద్ సహా భారతదేశంలో ఈ గ్రహణం సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాల పాటు పాక్షికంగా కనిపిస్తుంది. ఆచరణలు, సూచనలు జపాలు, అనుష్టానాలు చేసే వారు గ్రహణ స్పర్శకాలానికి ముందే స్నానం చేసి ఆ సమయానికే ప్రార్థనలు ప్రారంభించాలి. గ్రహణం పూర్తిగా ముగిసే వరకు (సాయంత్రం 6:48 గంటల వరకు) జపం కొనసాగించాలి. అనంతరం విడుపు స్నానం చేసి దేవాలయాన్ని శుభ్రం చేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే శివాలయాన్ని, నవగ్రహాలను దర్శించుకోవడం శ్రేయస్కరమని చెబుతున్నారు.