ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ లోగో ఇప్పుడు మారిపోయింది. ఎక్స్ అనే పేరుతో ట్విట్టర్ ను పిలవడం మొదలైంది. ట్విట్టర్ పరిభాష అయిన ట్వీట్ అనేది పోస్ట్ గానూ, రీట్వీట్ అనేది రీపోస్ట్ గానూ మారిపోయింది.
కొన్నిరోజులైతే ట్విట్టర్ అనేది ఒకటి మార్కెట్ లో ఉండేదన్న విషయం కూడా జనాల మైండ్ లోంచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ప్రస్తుతం ఎక్స్ లో మరో మార్పు వచ్చింది. ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్కు ఉన్న వినియోగదారులు తమ టిక్ మార్కును దాచుకునే అవకాశం ట్విట్టర్ కల్పిస్తోంది.
అంటే, మీరు కావాలనుకుంటే మీ ఫాలోవర్లకు బ్లూ టిక్ మార్క్ కనిపిస్తుంది. లేదనుకుంటే లేదన్నమాట.
Details
వ్యాల్యూ లేని బ్లూ టిక్
బ్లూ టిక్ మార్క్ అనేది వెరిఫైడ్ ప్రొఫైల్స్ కు మాత్రమే గతంలో ఇచ్చేవారు. కానీ ఎలాన్ మస్క్ చేసిన మార్పుల వల్ల ఎవరైతే బ్లూ టిక్ మార్కు కావాలని సబ్ స్క్రయిబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ బ్లూ టిక్ మార్క్ ఇస్తున్నారు.
ఇప్పుడు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం కూడా ట్విట్టర్ ఇచ్చేసింది. ఇలా రోజుకో మార్పు వస్తున్న ట్విట్టర్ లో రానున్న రోజుల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
పేరు మార్పు తర్వాత ట్విట్టర్ పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి.
ట్విట్టర్ లో ఈ కామర్స్ సేవలు లభించే అవకాశం ఉందని, అలాగే గేమ్స్ సహా అన్ని సేవలను అందించేలా మార్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.