
ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి ట్విట్టర్ పై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో చాలా మార్పులు రావడమే దానికి కారణం.
తాజాగా ట్విట్టర్ కు లిండా యాకరినో అనే కొత్త సీఈవో వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో ఎందుకు జాయిన్ అయ్యావంటూ అనేక ప్రశ్నలు వచ్చాయి.
తాజాగా ఆ ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. ఉద్యోగులకు తాను పంపిన ఈ -మెయిల్ లో తాను ట్విట్టర్ లో ఎందుకు జాయిన్ అయ్యిందో, ట్విట్టర్ లో తీసుకురావాల్సిన మార్పులేంటో ఉద్యోగులకు దిశానిర్దేశం చేసింది.
Details
ట్విట్టర్ మెయిన్ మిషన్ ఏంటంటే?
అంతరిక్షం అన్వేషణ నుండి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అనేక మార్పులు రావాలని ఎలాన్ అనుకున్నారు. అనుకున్నట్లుగానే మార్పులు చేసి సక్సెస్ అందుకున్నారు.
ట్విట్టర్ అనేది ప్రపంచ సమాచార కేంద్రంగా మారుతోంది. అందులో మార్పులు తీసుకురావడం అనివార్యం.
ఖచ్చితమైన సమాచారం జనాలకు అందించేందుకు ట్విట్టర్ ను మనం మార్చాల్సి ఉంది. ఇప్పుడు మన మిషన్ అదే. అందుకోసం మనం ఎంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.
ట్విట్టర్ లో మార్పు తీసుకొచ్చే క్రమంలో కొత్త భాగస్వామ్యాలు, కొత్త వ్యక్తుల అవసరం ఉంది. ట్విట్టర్ ను సక్సెస్ వైపు తీసుకెళ్ళే బాధ్యత మనదే. మన ఆలోచనల్లో మార్పువచ్చి గొప్పగా ఆలోచించినపుడే ట్విట్టర్ ను సక్సెస్ వైపు తీసుకెళ్ళగలం.
అందుకే నేను ట్విట్టర్ లో ఉన్నానని లిండా తెలియజేసింది.