LOADING...
NASA: భూమివైపు దూసుకుస్తున్న రెండు ఆస్టరాయిడ్లు.. ప్రమాదమేమైనా ఉందా?
భూమివైపు దూసుకుస్తున్న రెండు ఆస్టరాయిడ్లు.. ప్రమాదమేమైనా ఉందా?

NASA: భూమివైపు దూసుకుస్తున్న రెండు ఆస్టరాయిడ్లు.. ప్రమాదమేమైనా ఉందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమికి సమీపంగా రెండు గ్రహశకలాలు రానున్నాయని నాసా వెల్లడించింది. అయితే ఇవి భూమికి ఎలాంటి ప్రమాదం కలిగించవని స్పష్టం చేసింది. మార్చి 30, 2026న ఈ రెండు గ్రహశకలాలు భూమి సమీపం గుండా ప్రయాణించనున్నాయి. ఈ గ్రహశకలాలకు 2026 FN1, 2026 FA4 అనే పేర్లు పెట్టారు. ఇవి భూమికి సమీపంగా సంచరించే నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్స్ (NEOs) జాబితాలో చేర్చారు.

వివరాలు

ఇంటి పరిమాణంలో 2026 FN1

2026 FN1 అనే గ్రహశకలం సుమారు 56 అడుగుల పరిమాణంలో ఉంది. ఇది ఒక ఇంటి సైజ్‌తో సమానంగా ఉంటుంది. ఇది చిన్నది కాదనిపించినా, ఖగోళ పరిమాణాల దృష్ట్యా పెద్దది కాదు. ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంగా సుమారు 2.02 మిలియన్ మైళ్ల దూరంలో వెళ్లనుంది. ఇది చంద్రుడి దూరంతో పోలిస్తే సుమారు 8 రెట్లు ఎక్కువ దూరం కావడంతో పూర్తిగా సురక్షితం.

వివరాలు

విమాన పరిమాణంలో 2026 FA4

ఇక 2026 FA4 గ్రహశకలం సుమారు 67 అడుగుల పరిమాణంలో ఉండి, విమానం పరిమాణంతో సమానంగా ఉంటుంది. ఇది FN1 కంటే పెద్దదైనా, భూమికి ఇంకా ఎక్కువ దూరంలో ప్రయాణించనుంది. ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంగా సుమారు 3.89 మిలియన్ మైళ్ల దూరంలో వెళ్లనుందని నాసా అంచనా వేసింది. ఇది భూమి-చంద్రుడి మధ్య దూరం కంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ.

Advertisement

వివరాలు

ఎందుకు ప్రమాదం లేదు?

'క్లోజ్ అప్రోచ్' అనే పదం వినిపించినా, అంతరిక్ష ప్రమాణాల్లో మిలియన్ల మైళ్ల దూరం కూడా 'సమీపం'గానే పరిగణిస్తారు. ఈ రెండు గ్రహశకలాల కక్ష్యలు భూమికి సురక్షిత దూరంలోనే కొనసాగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ ఇలాంటి వస్తువులు భూమి వాతావరణంలోకి ప్రవేశించినా, అవి ఎక్కువగా గాలిలోనే కాలిపోవడం లేదా పేలిపోవడం సాధారణం. నేలపై పెద్దగా ప్రభావం ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నాసా పర్యవేక్షణ ఎలా? భూమికి సమీపంగా సంచరించే గ్రహశకలాలను నాసా నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థల సహాయంతో వేలాది నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్స్‌పై శాస్త్రవేత్తలు కంటిన్యూస్‌గా నిఘా ఉంచుతున్నారు. ఈ ప్రక్రియ గ్లోబల్ ప్లానెటరీ డిఫెన్స్‌లో భాగంగా ఉంటుంది.

Advertisement

వివరాలు

భూమికి ఎలాంటి ముప్పు లేదు

మొత్తంగా 2026 FN1, 2026 FA4 గ్రహశకలాలు భూమికి ఎలాంటి ముప్పు కలిగించవని నాసా స్పష్టం చేసింది. మార్చి 31న మరో గ్రహశకలం కూడా భూమి సమీపం గుండా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపైనా నిఘా కొనసాగుతోంది. అంతరిక్షంలో ఇలాంటి గ్రహశకలాల ప్రయాణం సాధారణమే అయినప్పటికీ, వాటిని ముందుగానే గుర్తించి పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్ ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేయగలుగుతున్నామని నిపుణులు చెబుతున్నారు.

Advertisement