UAEలో UPI చెల్లింపులు.. ఎలా చేస్తున్నారో తెలుసా?
NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అంతటా QR కోడ్ ఆధారిత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులను ప్రారంభించడానికి నెట్‌వర్క్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ యొక్క విస్తృతమైన వ్యాపారి నెట్‌వర్క్‌లో భారతీయ పర్యాటకులు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) కోసం సురక్షితమైన లావాదేవీలను ఈ సహకారం సులభతరం చేస్తుంది. నెట్‌వర్క్ ఇంటర్నేషనల్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (MEA) ప్రాంతంలో డిజిటల్ కామర్స్‌లో అగ్రగామిగా ఉంది. 60,000+ వ్యాపారులలో 200,000 పాయింట్-ఆఫ్-సేల్ (POS) టెర్మినల్‌లను కలిగి ఉంది.
భారీగా పెరిగిన పర్యాటకులు
ఈ వ్యాపారులు రిటైల్, హాస్పిటాలిటీ, రవాణా, సూపర్ మార్కెట్‌లతో సహా వివిధ రంగాలలో విస్తరించి ఉన్నారు. రిటైల్ స్టోర్‌లు, డైనింగ్ అవుట్‌లెట్‌లు, దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు వంటి విస్తృత శ్రేణి సంస్థల్లో యూపీఐని అనుమతిస్తున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలకు ప్రయాణించే భారతీయ పర్యాటకుల సంఖ్య 2024 నాటికి 9.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఈ క్రమంలో యూఈఏ భారత్ నుంచి ఏటా 5.29 మిలియన్ల పర్యాకటకులను ఆశఇస్తోంది.
ఎలా ఉపయోగించాలి
యూఏఈలో భారతీయ పర్యాటకులు, ఎన్ఆర్ఐలు యూపీఐని ఉపయోగించడం చాలా సులభం. వ్యాపారి అనుకూలతను తనిఖీ చేయండి: రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు, ప్రసిద్ధ ఆకర్షణలతో సహా పాల్గొనే వ్యాపారుల వద్ద యూపీఐ లోగోను చూడాలి. QR కోడ్‌ని స్కాన్ చేయండి: POS టెర్మినల్‌లో వ్యాపారి QR కోడ్‌ని స్కాన్ చేయడానికి UPI-ప్రారంభించబడిన యాప్‌ని ఉపయోగించండి. ఆ తర్వాత చెల్లింపు మొత్తాన్ని నమోదు చేయాలి. లావాదేవీ మొత్తాన్ని ఎంటర్ చేయాలి. అనంతరం వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేసి.. చెల్లింపును పూర్తి చేయాలి.