Page Loader
S23 అల్ట్రా నుండి కోకా-కోలా ఫోన్ వరకు భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు
భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు

S23 అల్ట్రా నుండి కోకా-కోలా ఫోన్ వరకు భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 28, 2023
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

2023 సంవత్సరం మొదలుకాగానే భారతదేశంలో iQOO 11, TECNO PHANTOM X2 సిరీస్, Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యాయి. సామ్ సంగ్, OnePlus వంటి బ్రాండ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే Realme ప్రత్యేకమైన Coca-Cola బ్రాండెడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేస్తుంది. లాంచ్ కాబోయే ఫోన్‌ల లిస్ట్ చూడండి. ఫోన్ #1: సామ్ సంగ్ Galaxy S23 Ultra ఫిబ్రవరి 1న లాంచ్ అవుతుంది. హ్యాండ్‌సెట్ మధ్యలో పంచ్-హోల్, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ రక్షణతో, 200MP కెమెరాతో, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, 5,000mAh బ్యాటరీతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ఓవర్‌లాక్ వెర్షన్‌ తో వస్తుంది.

ఫోన్

Realme coco cola బ్రాండ్ తో కలిసి సరికొత్త ఫోన్ ఎడిషన్ విడుదల చేయబోతుంది

ఫోన్ #2: OnePlus 11, OnePlus 11R, OnePlus Pad సహా అనేక ఉత్పత్తులతో ఫిబ్రవరి 7న భారతదేశంలో వస్తుంది. ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ కు అలర్ట్ స్లైడర్, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌, 5,000mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌,16MP సెల్ఫీ కెమెరా, 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉన్నాయి. ఇంకా ఈ లిస్ట్ లో ఫిబ్రవరి 16న భారతదేశంలో విడుదల కాబోతున్న iQOO Neo 7, ఫిబ్రవరి మొదటి వారంలో రాబోతున్న OPPO రెనో 8T సిరీస్, Realme సరికొత్తగా లాంచ్ చేయబోతున్న Realme 10 Coca-Cola-ఎడిషన్ ఉన్నాయి.