Page Loader
భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్
ప్రీ-బుకింగ్‌లు ఫిబ్రవరి 8 వరకు అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 12, 2023
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 1న జరిగే Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ సిరీస్‌ను ప్రారంభించనున్నట్లు సామ్ సంగ్ సృష్టం చేసింది. భారతదేశంలో లాంచ్ కి ముందే ప్రీ-బుకింగ్‌లకు మొదలయ్యాయి. ఈ సిరీస్ లో S23, S23 ప్లస్, S23 అల్ట్రా మోడల్‌లు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 5,000 విలువైన ఇ-వోచర్ తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. సామ్ సంగ్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు ముందస్తు డెలివరీలు, ఇతర ప్రయోజనాలను పొందడానికి హ్యాండ్‌సెట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ S23 సిరీస్ ఆపిల్ iPhone 14తో పాటు గూగుల్ Pixel 7 సిరీస్ కు పోటీగా వస్తుంది.

సామ్ సంగ్

ముందస్తుగా బుక్ చేసుకున్నవారికి కూపన్ తో పాటు మరికొన్ని ప్రయోజనాలు అందిస్తున్న సామ్ సంగ్

రూ.1,999 చెల్లించి Galaxy S23 ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ముందస్తు రిజర్వేషన్‌కి బదులుగా, samsung.comలో వాడుకోవడానికి రూ.5,000 కూపన్, స్మార్ట్‌ఫోన్ ముందస్తు డెలివరీ, ప్రత్యేకమైన రంగు ఆప్షన్స్ ను ఎంచుకునే అవకాశం, మరియు రూ. 2,000 విలువైన వెల్‌కమ్ వోచర్‌ను అందించే స్మార్ట్ క్లబ్ సభ్యత్వం. Samsung Shop యాప్ ద్వారా 2% లాయల్టీ పాయింట్‌లు వంటి ప్రయోజనాలు పొందుతారు. Galaxy S23 సిరీస్12GB లేదా 16GB LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తోవస్తుంది. సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ఫిబ్రవరి 1న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం అవుతుంది. ప్రీ-బుకింగ్‌లు ఫిబ్రవరి 8 వరకు అందుబాటులో ఉంటాయి. ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తయారీసంస్థ వెల్లడిస్తుంది.