Page Loader
శుక్రుడి రహస్యం తెలిసిపోయింది.. పార్కర్ సోలార్ అద్భుతమైన ఆవిష్కరణలు
పార్కర్ సోలార్ అద్భుతమైన ఆవిష్కరణలు

శుక్రుడి రహస్యం తెలిసిపోయింది.. పార్కర్ సోలార్ అద్భుతమైన ఆవిష్కరణలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 04, 2023
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌర వ్యవస్థలోని గ్రహాల్లో ఒకటైన శుక్రుడి గురించి పార్కర్ సోలార్ అద్భుతమైన రహస్యాలను పరిశీలించింది. ఈ మేరకు శుక్రడి వద్ద అత్యంత కఠినమైన వాతావరణం, ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితిగతులు ఉంటాయని తేల్చింది. ఎన్నో దశాబ్ధాలుగా శుక్రుడి మీద పరిశోధనలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఉత్కంఠ ఏర్పడింది. ఇటీవలే అమెరికా నాసాకు చెందిన పార్కర్ సోలార్ అద్భుతమైన ఆవిష్కరణ చేసి డేటాను సంపాదించింది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయంలోని అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్తలు శుక్రగ్రహంపై మెరుపులు తరచుగా సంభవించకపోవచ్చని సాక్ష్యాలను బహిర్గతం చేశారు. అయితే ఇది దీర్ఘకాలిక శాస్త్రీయ చర్చలకు విరుద్ధంగా ఉందన్నారు.

details

శుక్రుడి మీద ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ

జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, సౌర వ్యవస్థలోని ఒకటైన శుక్రుడి మీద గల రహస్యాలను చేధించింది. ఎల్లప్పుడూ వేడిగా ఉండే శుక్రుడు, భూమికి సమీప గ్రహంగా నిలిచింది. అక్కడ కార్బన్ డయాక్సైడ్ సమృద్ధిగా ఉంటుందని, ఇది గ్రీన్‌హౌస్ ప్రభావానికి దారితీస్తుందని సదరు నివేదిక వివరించింది. అయితే గ్రహం విపరీతమైన పరిస్థితులు, ఉష్ణోగ్రతలు దాదాపుగా 900 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరుకోవడం, వాతావరణ పీడనాలను అణిచివేయడంతో ఏ అంతరిక్షనౌక దాని ఉపరితలంపై ఎక్కువ కాలం జీవించలేదు. ప్రపంచాన్ని పరిశోధించేందుకు 2018లో పరిశోధనలను ప్రారంభించిన NASA,పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ఉపయోగించారు. ప్రోబ్ ప్రాథమికంగా సూర్యుడి సౌర గాలిని అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 2021లో ఫ్లైబైలో వీనస్ గురించి విలువైన డేటాను సేకరించారు.