Chandrayaan-3 : ఇస్రో మరో అద్భుతం.. విక్రమ్ ల్యాండర్ కదలిక
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 భారీ విజయం సాధించడంతో భారత ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. అయితే ల్యాండర్, రోవర్ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయ్యింది. దీంతో ల్యాండర్ విక్రమ్ లో కదలికలు ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. దీంతో మరో అద్భుతం సృష్టించినట్టైంది. సెప్టెంబర్ 22న చంద్రుడిపై రాత్రి రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమాచారాన్ని పునరుద్ధరించేందుకు ఇస్రో చర్యలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై లూనార్ నైట్ లో భాగంగా 14 రోజులు గడ్డకట్టే చలిలో గడిపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇస్రో తాజా ప్రయోగంతో కదలికలు ఏర్పడ్డాయి. దీంతో అవి శాశ్వత నిద్రలోకి జారుకుంటాయని భావించిన ఇస్రో గుడ్ న్యూస్ అందించింది.
చంద్రయాన్-3 మిషన్ పునరుద్ధరణపై ఆశలు సజీవం
ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్ లోని ఇంజన్లను మండించిన ఇస్రో, కొద్దిగా ఎత్తుకు ఎగిరేలా చేసి పక్కకు దిగేలా సాంకేతాలు అందించారు. ప్రస్తుతం శవశక్తి పాయింట్ నుంచి 40 సెంటీమీటర్ల మేర ఎత్తుకు ఎగిరి తర్వాత 30 సెమీ పక్కకు జరిగి సేఫ్ ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో పునరుద్ధరణపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆశలు సజీవమయ్యాయి. ఆగస్ట్ 23న ల్యాండర్ విక్రమ్, చంద్రుడి దక్షిణ ఉపరితలంపై క్షేమంగా ల్యాండైంది. అనంతరం ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు పలు కోణాల్లో ప్రయోగాలు జరిగాయి. అనంతరం జాబిల్లిపై రాత్రి రోజులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శివశక్తి పాయింట్ పై సూర్యరష్మి లేకుండాపోయింది.
మరోసారి కీలక ప్రయోగాలకు విక్రమ్ ల్యాండర్ సన్నద్ధం
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్ ను శాస్త్రవేత్తలు స్లీపింగ్ మోడ్ యాక్టివేట్ చేశారు. జాబిల్లిపై రాత్రి వేళ ఉష్ణోగ్రతలు -120 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. అతి శీతల ప్రదేశాల్లో అవి పనిచేసేందుకు ఆస్కారం లేదు. సెప్టెంబర్ 22న చంద్రుడిపై రాత్రి రోజులు పూర్తై ల్యాండర్, రోవర్ గల దక్షిణ ధ్రువం వద్ద మళ్లీ సూర్యోదయం ఏర్పడింది. ఈ మేరకు వాటితో సమాచారాన్ని పునరుద్ధరించేందుకు ఇస్రో చేపట్టిన యత్నాలు విఫలమయ్యాయి. కానీ ఇస్రో చేపట్టిన తాజా ప్రయోగాలు విక్రమ్ ల్యాండర్ లో కదలికలు వచ్చేలా చేసింది. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంలో మరోసారి కీలక ప్రయోగాలకు విక్రమ్ ల్యాండర్ సిద్ధమవుతోంది.