Page Loader
Vivo T2x vs Samsung Galaxy M14లో బెస్ట్ ఫోన్ ఇదే!
వీవో టీఎక్స్, సామ్ సంగ్ గెలాక్సీ M14

Vivo T2x vs Samsung Galaxy M14లో బెస్ట్ ఫోన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2023
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివో టీ2ఎక్స్​, శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14 స్టార్ట్ ఫోన్స్ భారతదేశం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ రెండు ఫోన్స్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏ ఫోన్ కొంటే మనకు ఉపయోగమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివో టీ2ఎక్స్​,​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్​డ్రాప్​ నాచ్​ ను ప్రవేశపెట్టారు. శాంసగ్ గెలాక్సీ ఎం14లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఆకర్షణీయంగా ఉంది. వివో టీ2ఎక్స్ లో 6.58 ఇంచ్ ఎల్ సీడీడిస్ ప్లే తో పాటు 1080X2408 పిక్సెల్స్​ ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​ ఉండనుంది. గ్యాలెక్సీ ఎం14లో 6.6 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్ తో పాటు 1080X2408 పిక్సెల్స్​ ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​ కూడా ఉంది.

Details

ఫోన్స్ ధర, వివరాలు

వివో టీ2 ఎక్స్ లో 50 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ మాక్రో కెమెరా, ఎల్ ఈడి ప్లాష్ లైట్ తో వచ్చింది. అదే విధంగా శాంసంగ్ గ్యాలెక్సీలో ఎం14లో 50 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెకండరీతో పాటు డెప్త్ సెన్సార్ లభిస్తోంది. ఈరెండు స్టార్ట్ ఫోన్స్ ఫుల్ హెచ్ డీ 1080 పీ వీడియోతో షూట్ చేసుకొనే అవకాశం ఉంది. వివో టీ2ఎక్స్ 4 జీబీ ర్యామ్ ఫోన్ ధర 12,999 ఉండగా.. 8జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.15,999 ఉండనుంది. శాంసంగ్ గ్యాలెక్సీ ఎం14 14 జీబీ ర్యామ్ ఫోన్ ధర 14,990 ఉండగా.. 6జీబీ ర్యామ్ ధర రూ.16,490 ఉండనుంది.