Page Loader
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త టెక్నాలజీ అందిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో వీవో ఎప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీవో వీ29 ఫోన్ మోడల్ లాంచ్ పై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆక్టోబర్ 4న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు వీవో సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ధర, ఫీచర్స్ వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ ఫోన్ హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ అనే మూడు రంగుల్లో వస్తోంది. V29 సిరీస్‌లో స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్, కర్వ్డ్ డిస్‌ప్లే ఉండనుంది. వనిల్లా, ప్రో వేరియంట్‌లు వరుసగా 186 గ్రాములు, 188 గ్రాముల బరువును కలిగి ఉంటాయి.

Details

ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ తో వస్తున్న వీవో వీ29 

Vivo V29లో 6.78-అంగుళాల పూర్తి-HD+ కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, స్మార్ట్ ఆరా లైట్‌తో కూడిన 2MP సెన్సార్ ఉండనున్నాయి. ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌, 4,600mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఫోన్ భద్రత కోసం అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా ఈ ఫోన్ లో అమర్చారు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధరపై వీవో సంస్థ క్లారిటీ ఇవ్వనుంది.