గగన్‌యాన్ మిషన్ రెండో దశలో వ్యోమమిత్ర.. మహిళా రోబోను నింగిలోకి పంపిస్తున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), గగన్‌యాన్ మిషన్ వ్యోమమిత్ర తొలిదశ ట్రయల్స్‌ను ఈనెలాఖరులోగా ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే ప్రకటన చేశారు. మిషన్ రెండో దశలో వ్యోమమిత్ర అనే మహిళా రోబోట్-హ్యూమనాయిడ్ రోబోట్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. వ్యోమమిత్ర అంటే వ్యోమ (అంతరిక్షం), మిత్ర (స్నేహితుడు) నుంచి ఉద్భవించిన పేరు. 'హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ - ప్రెజెంట్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్' పేరుతో 2021 ఈవెంట్ ప్రారంభ సెషన్‌లో ఈ హాఫ్ హ్యూమనోయిడ్ అరంగేట్రం చేసింది. రెండో దశలో మాడ్యూల్ పారామీటర్‌ల పర్యవేక్షణ, హెచ్చరికలు జారీ, లైఫ్ సపోర్ట్ ఆపరేషన్ అమలు చేయడం లాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ రోబో అన్ని మానవ కార్యకలాపాలను నిర్వహిస్తుంది : కేంద్రం
వ్యోమమిత్ర స్విచ్ ప్యానెల్‌లను ఆపరేట్ చేయడం,వ్యోమగాములకు సహచరుడిగా పనిచేయడం,సంభాషించడం, గుర్తించడం, విచారణలకు ప్రతిస్పందించడం వంటి పనులను చేయగలదు. ఈ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్, అంతరిక్ష వాతావరణంలో మానవ విధులను అనుకరించేందుకు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో పరస్పర చర్య చేపట్టేలా ఇస్రో రూపొందించింది. తొలి ట్రయల్ మిషన్‌ను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.వ్యోమగాములను పంపించడమే కాదు వాటిని తిరిగి తీసుకురావడం కీలకం. రెండో మిషన్‌లో మహిళా రోబోను 2024, లేదా 2025 ఆరంభంలో రెండోదశ ట్రయల్ ఉండనుంది. 3 రోజుల నిమిత్తం ముగ్గురు సిబ్బందిని 400 కి.మీ ఎత్తులో కక్ష్యలోకి పంపి భారత్ మానవ అంతరిక్ష సామర్థ్యాలను ప్రదర్శించనుంది. మనుషులు సురక్షితంగా భూమికి తిరిగి రావడం, సముద్ర జలాల్లో దిగడంతో ఈ మిషన్ ముగియనుంది.