Page Loader
TRAI: విసిగించే కాల్స్‌కు చెక్ పెట్టండిలా.. టెల్కోలకు ట్రాయ్ హెచ్చరికలు
విసిగించే కాల్స్‌కు చెక్ పెట్టండిలా.. టెల్కోలకు ట్రాయ్ హెచ్చరికలు

TRAI: విసిగించే కాల్స్‌కు చెక్ పెట్టండిలా.. టెల్కోలకు ట్రాయ్ హెచ్చరికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2024
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇబ్బందికరమైన కాల్స్ పెరుగుతున్నాయంటూ ఈ మధ్య భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో టెల్కోలకు, వారి టెలి మార్కెటర్లకు ట్రాయ్ హెచ్చరికలు జారీ చేసింది. వాయిస్ కాల్ బల్క్ కమ్యూనికేషన్‌లను ఆరికట్టడానికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా విసిగించే కాల్స్ చేసేవారిని గుర్తించడానికి టెక్నికల్ సొల్యూషన్స్ వాడాలని పేర్కొంది. అనవసర కమర్షియల్ కాల్స్ గరించి వినియోగదారుల ఫిర్యాదుల దృష్ట్యా స్పామర్ లపై చర్యలు తీసుకోనున్నారు.

Details

సర్వీస్ ప్రొవైడర్లు,టెలి మార్కెటర్లతో సమావేశం

దీనికోసం యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు, వారి డెలివరీ టెలి మార్కెటర్లతో సమావేశాన్ని నిర్వహించినట్లు ట్రాయ్ తెలిపింది. మరోవైపు సంబంధిత సంస్థలకు తెలియకుండా హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను దుర్వినియోగం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇక రోబోటిక్ కాల్స్, ఆటో-డయలర్ కాల్స్ ను నియత్రించడంపైనా దృష్టి సారించారు.