
Jupiter: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బృహస్పతిపై.. వందల రెట్ల కాంతి (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షం నుంచి భూమిపైకి వస్తున్న అధిక విద్యుద్దయాల కణాలు,భూ ధ్రువాల వద్ద ఉన్న వాతావరణ వాయు కణాలతో ఎదురెదురుగా ఢీకొనడం వల్ల,ఆకాశంలో అద్భుతమైన కాంతిజ్యోతులు వెలుగుతూ కనిపిస్తాయి.
ఇవే ఉత్తర,దక్షిణ ధ్రువజ్యోతులుగా ప్రసిద్ధి పొందినవి. అయితే భూమికి పదుల రెట్లు పెద్దదైన గురు గ్రహం ధ్రువ ప్రాంతాల్లో, ఈ జ్యోతులు వందల రెట్లు అధిక కాంతితో నర్తిస్తున్నట్టు జేమ్స్ వెబ్ అంతరిక్ష దూరదర్శిని (టెలిస్కోప్) గుర్తించింది.
2023 క్రిస్మస్ సందర్భంగా ఈ టెలిస్కోప్ తీసిన గురు గ్రహ ధ్రువజ్యోతుల చిత్రాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
ఇదే తరహాలో, గతంలో వాయేజర్ 2 అంతరిక్ష నౌక నెప్ట్యూన్ గ్రహ ధ్రువ ప్రాంతాల్లో కూడా కొన్ని మోస్తరు కాంతుల ప్రదర్శనను గుర్తించిన సంగతి విదితమే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గురు గ్రహ ధ్రువాల వద్ద వందల రెట్ల కాంతి
🌌 Jupiter’s Auroras Captured by JWST!
— Asgardia (@AsgardiaSpace) May 12, 2025
The James Webb Space Telescope has observed stunning auroras on Jupiter, shedding light on how its upper atmosphere heats and cools.
Watch the video and explore the mysteries of the gas giant!
#JWST #Jupiter #SpaceExploration #Astronomy pic.twitter.com/qI5pv51iFY