Loading...
WhatsApp schedule messages: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వచ్చేసిన షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వచ్చేసిన షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్

WhatsApp schedule messages: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వచ్చేసిన షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ యూజర్లకు శుభవార్త. చాలాకాలంగా ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను వాట్సప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మెసేజ్‌లు పంపేందుకు థర్డ్‌ పార్టీ యాప్‌లు, ప్రత్యేక రిమైండర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనం పంపాలనుకున్న సందేశాలను ముందుగానే షెడ్యూల్‌ చేస్తే.. నిర్ణయించిన సమయానికి అవి ఆటోమేటిక్‌గా అవతలి వ్యక్తులకు చేరతాయి. ఈ సదుపాయం వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్‌ చాట్‌లలోనూ పనిచేస్తుంది. కనీసం 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్ఠంగా రెండు వారాల వరకు మెసేజ్‌లను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. మనం నిర్ణయించిన సమయంలో ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా, వాట్సప్‌ యాప్‌ను క్లోజ్‌ చేసినా షెడ్యూల్‌ చేసిన మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతాయి.

వివరాలు 

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత

టెక్ట్స్‌ సందేశాలతో పాటు లింకులు, ఫొటోలు, వీడియోలను కూడా ముందుగానే షెడ్యూల్‌ చేసుకోవచ్చు.

వీటన్నింటికీ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉంటుంది. అయితే ప్రస్తుతం డాక్యుమెంట్లను షెడ్యూల్‌ చేసే అవకాశం మాత్రం లేదు.

షెడ్యూల్‌ చేసిన సందేశాలు డెలివరీ కావడానికి ముందే వాటి వివరాలను చూసుకునే సదుపాయం కూడా ఉంది.

ఇందుకోసం చాట్‌ ఇన్ఫర్మేషన్‌ స్క్రీన్‌లో ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ముందుగా సెట్‌ చేసిన మెసేజ్‌ల వివరాలు కనిపిస్తాయి.

ఒకవేళ పంపాల్సిన అవసరం లేదని భావిస్తే.. డెలివరీకి ముందే వాటిని తొలగించుకోవచ్చు.

గ్రూప్‌ చాట్‌లలో షెడ్యూల్డ్‌ మెసేజ్‌ల విషయంలోనూ వాట్సప్‌ ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది.

వివరాలు 

కొత్తగా గ్రూప్‌లో చేరిన వారికి ఆ పాత సందేశం కనిపించదు

ఒక గ్రూప్‌లో మెసేజ్‌ను షెడ్యూల్‌ చేసినప్పుడు.. అది డెలివరీ అయ్యే సమయానికి గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే చేరుతుంది.

మెసేజ్‌ డెలివరీ అయిన తర్వాత కొత్తగా గ్రూప్‌లో చేరిన వారికి ఆ పాత సందేశం కనిపించదు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లలో కొందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మరింత మంది యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

వాట్సప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్‌ చేయడం ఎలా?

ముందుగా వాట్సప్‌ ఓపెన్‌ చేసి, మీరు మెసేజ్‌ పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్‌ చాట్‌లోకి వెళ్లాలి.

అక్కడ పంపాలనుకున్న టెక్ట్స్‌ మెసేజ్‌ను టైప్‌ చేయాలి లేదా ఫొటో, వీడియో వంటి మీడియాను జత చేయాలి.

ఆ తర్వాత సెండ్‌ బటన్‌పై కొద్దిసేపు నొక్కి ఉంచాలి. అప్పుడు తేదీ, సమయాన్ని ఎంచుకునే ఆప్షన్‌ కనిపిస్తుంది.

మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకుని మెసేజ్‌ను షెడ్యూల్‌ చేయాలి.

ఇలా చేసిన తర్వాత సంబంధిత చాట్‌లోనే షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ కోసం ప్రత్యేక సెక్షన్‌ కనిపిస్తుంది.

అందులో మీరు ముందుగా షెడ్యూల్‌ చేసిన సందేశాల వివరాలను పరిశీలించుకోవచ్చు. అవసరమైతే వాటిని డెలివరీకి ముందే డిలీట్‌ చేసుకోవచ్చు.

ADVERTISEMENT