WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు...గ్రూప్‌లలో ప్రత్యేక స్టేటస్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ గ్రూపుల్లో రోజూ వందలాది సందేశాలు వస్తుంటాయి. అలాంటి గ్రూప్‌లో కొత్తగా చేరినవారికి గతంలో జరిగిన చర్చలు తెలియకపోవడం సహజం. ఈ సమస్యను తగ్గించడంతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా గుర్తించేలా మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. పాత చాట్ హిస్టరీని తర్వాత కూడా షేర్ చేయడం, ముఖ్యమైన మెసేజ్‌లను గడువు లేకుండా పిన్ చేయడం, మెన్షన్లను ప్రత్యేకంగా గుర్తించడం, గ్రూప్ సభ్యులకే కనిపించే స్టేటస్‌లను పెట్టడం వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి.
Details
ఇక ముఖ్యమైన మెసేజ్‌లు ఎప్పటికీ పిన్ చేయొచ్చు
గ్రూప్‌లో కీలకమైన సమాచారం అందరికీ కనిపించేలా ఉంచేందుకు మెసేజ్‌లను పిన్ చేసే సదుపాయం ఇప్పటికే ఉంది.
అయితే ఇప్పటివరకు వాటిని 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు మాత్రమే పిన్ చేయగలిగేవారు. కొత్త మార్పుతో గడువు లేకుండా ముఖ్యమైన సందేశాలను పిన్ చేసి ఉంచుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న నాలుగు పిన్ మెసేజ్‌ల పరిమితిలో ఈ మార్పు ఎలా అమలవుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
Details
కొత్త సభ్యులకు పాత చాట్ హిస్టరీ
గ్రూప్‌లోకి కొత్తగా వచ్చినవారికి గత చర్చలు తెలియకపోతే విషయాన్ని మళ్లీ మొదటి నుంచి వివరించాల్సి వస్తుంది.
ఈ ఇబ్బందిని తగ్గించేందుకు వాట్సాప్ చాట్ హిస్టరీ షేరింగ్ సదుపాయాన్ని విస్తరిస్తోంది. గతంలో సభ్యుడిని చేర్చే సమయంలోనే పాత సందేశాలను పంపే అవకాశం ఉండేది.
ఇకపై ఆ సమయంలో మరిచిపోయినా తర్వాత కూడా అడ్మిన్లు లేదా గ్రూప్ మేనేజర్లు చాట్ హిస్టరీని షేర్ చేయవచ్చు. ఈ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని కంపెనీ తెలిపింది.
Details
మెన్షన్లు, గ్రూప్ స్టేటస్‌కు ప్రత్యేక గుర్తింపు
గ్రూప్‌లో ఎవరైనా తమను ట్యాగ్ చేసినప్పుడు ఆ సందేశాన్ని సులభంగా గుర్తించేందుకు ప్రత్యేక ఫిల్టర్ అందుబాటులోకి రానుంది.
దీంతో వందలాది మెసేజ్‌ల మధ్య తమ ప్రస్తావన ఉన్న సందేశాలను వెతకాల్సిన అవసరం తగ్గుతుంది.
మరోవైపు, ఎంపిక చేసిన గ్రూప్ సభ్యులకే కనిపించే ప్రత్యేక స్టేటస్‌ను కూడా పెట్టుకోవచ్చు. ఇది సాధారణ స్టేటస్‌లాగే 24 గంటల తర్వాత తొలగిపోతుంది. సభ్యులు దానికి స్పందించడంతో పాటు తమ స్టేటస్‌ను కూడా జోడించవచ్చు.