Loading...
WhatsApp: ఒక్కసారిగా 'అకౌంట్ ఇన్ రివ్యూ' మెసేజ్.. వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన
ఒక్కసారిగా 'అకౌంట్ ఇన్ రివ్యూ' మెసేజ్.. వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన

WhatsApp: ఒక్కసారిగా 'అకౌంట్ ఇన్ రివ్యూ' మెసేజ్.. వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో పాటు పలు దేశాల్లోని వాట్సాప్ వినియోగదారులు సోమవారం రాత్రి ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే పలువురి వాట్సాప్ ఖాతాలు 24 గంటల పాటు 'అకౌంట్ ఇన్ రివ్యూ'లోకి వెళ్లడంతో చాట్స్ పంపడం,కాల్స్ చేయడం,ఇతర ఫీచర్లను ఉపయోగించడం పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిణామంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది. వాట్సాప్ యాప్ తెరిచిన వెంటనే "Account in review. Date requested: 3 Aug 2026. మీ అకౌంట్ కార్యకలాపాలు,డివైస్ సమాచారం మా సేవా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నాం.సాధారణంగా 24 గంటల్లో ఫలితాన్ని తెలియజేస్తాం" అనే సందేశం కనిపించినట్లు బాధితులు తెలిపారు.

వివరాలు 

సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు

అదే నోటిఫికేషన్‌లో "How to use WhatsApp responsibly", "About stolen phone and accounts" అనే సమాచార పేజీలకు కూడా లింకులు చూపించింది.

రివ్యూ పూర్తయ్యే వరకు సందేశాలు పంపడం, కాల్స్ చేయడం, ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయడం సహా వాట్సాప్‌లోని ఏ ఫీచర్‌ను కూడా ఉపయోగించలేకపోయినట్లు వినియోగదారులు పేర్కొన్నారు.

ఈ అంశంపై సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఖాతాపై ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా రివ్యూలోకి పంపడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పలువురు ఎక్స్ (X) వేదికలో తమ అనుభవాలను పంచుకుంటూ, భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఇదే సమస్య ఎదురైందని పేర్కొన్నారు.

వివరాలు 

మొత్తం ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయనే విషయాన్ని వెల్లడించని కంపెనీ 

ఈ ఘటనపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధి,అకౌంట్లను గుర్తించే సంస్థ ఆటోమేటెడ్ వ్యవస్థలు ప్రతిసారీ సరైన నిర్ణయం తీసుకోకపోవచ్చని అంగీకరించారు.

సేవను దుర్వినియోగం చేసే ఖాతాలను గుర్తించి ఇతర వినియోగదారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని,అయితే కొన్నిసార్లు నిజమైన వినియోగదారుల ఖాతాలు కూడా పొరపాటున గుర్తించబడే అవకాశం ఉంటుందని తెలిపారు.

అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

అయితే ఈ సమస్యతో మొత్తం ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

ఖాతాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తాం: వాట్సాప్

అలాగే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా, లేక ఆటోమేటెడ్ మోడరేషన్ ప్రక్రియలో భాగంగా ఖాతాలు రివ్యూకు వెళ్లాయా అనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదు.

పొరపాటున రివ్యూలోకి వెళ్లిన నిజమైన వినియోగదారుల ఖాతాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తామని మాత్రమే వాట్సాప్ పేర్కొంది.

ADVERTISEMENT