LOADING...
WhatsApp: వాట్సప్‌ యూజర్‌నేమ్‌ వివాదం: సమాధానానికి మరో మూడు రోజుల గడువు
వాట్సప్‌ యూజర్‌నేమ్‌ వివాదం: సమాధానానికి మరో మూడు రోజుల గడువు

WhatsApp: వాట్సప్‌ యూజర్‌నేమ్‌ వివాదం: సమాధానానికి మరో మూడు రోజుల గడువు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు సంబంధించిన వివాదంపై స్పందించేందుకు ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల గడువును మంజూరు చేసింది. కంపెనీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ అదనపు సమయం ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అధికారులతో జరిగిన చర్చల్లో, సంప్రదింపులు పూర్తయ్యే వరకు యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టబోమని వాట్సప్‌ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

వివరాలు 

సైబర్‌ నేరాలు పెరిగే ప్రమాదం.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన

ఫోన్‌ నంబర్‌ను వెల్లడించకుండా యూజర్‌నేమ్‌తో మాత్రమే ఖాతాలను ఉపయోగించే అవకాశం కల్పిస్తే, ఆన్‌లైన్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్టు పేరుతో జరిగే వేధింపులు, మారుపేర్లతో దాడులు వంటి సైబర్‌ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వాట్సప్‌ నుంచి వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువు గత శుక్రవారంతో ముగిసింది. అనంతరం కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు మరో మూడు రోజుల గడువును ప్రభుత్వం మంజూరు చేసినట్లు సమాచారం.

Advertisement