Anil Menon: ఐఎస్ఎస్ మిషన్‌లో నాసా కొత్త ఆస్ట్రోనాట్ కీలక పాత్ర.. అనిల్ మీనన్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్తగా చేరిన ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. జూలై 14, 2026న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లే తన తొలి అంతరిక్ష ప్రయాణానికి ఆయన సిద్ధమవుతున్నారు. 2021లో నాసా ఎంపిక చేసిన అనిల్ మీనన్ వైద్యశాస్త్రం, ఇంజినీరింగ్‌లో పట్టాలు పొందారు. అంతకుముందు ఫ్లైట్ సర్జన్‌గా పనిచేసి, అంతరిక్ష యాత్రికుల ఆరోగ్య నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
వివరాలు
ఈ మిషన్‌లో అనిల్ బాధ్యతలు ఇవే..
అలాగే SpaceXతో కలిసి కమర్షియల్ స్పేస్ మిషన్ల కోసం మెడికల్ సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధిలో కూడా భాగమయ్యారు. ఈ మిషన్‌లో ఆయన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం, ఆస్ట్రోనాట్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వంటి బాధ్యతలు చేపడతారు. అలాగే స్పేస్‌వాక్‌లు, స్టేషన్ మెయింటెనెన్స్‌కు సంబంధించిన పనుల్లో కూడా పాల్గొననున్నారు. ఈ ప్రయాణం కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా జరగనుంది. అంతర్జాతీయ బృందంతో కలిసి ఈ మిషన్‌లో ఆయన పాల్గొననున్నారు. ప్రయోగాన్ని నాసా అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.