Loading...
Chirantan Desai: మెటాలో భారత సంతతి టెక్‌ నిపుణుడికి కీలక బాధ్యత.. ఎవరీ చిరంతన్ దేశాయ్‌?
మెటాలో భారత సంతతి టెక్‌ నిపుణుడికి కీలక బాధ్యత.. ఎవరీ చిరంతన్ దేశాయ్‌?

Chirantan Desai: మెటాలో భారత సంతతి టెక్‌ నిపుణుడికి కీలక బాధ్యత.. ఎవరీ చిరంతన్ దేశాయ్‌?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్‌ దిగ్గజ సంస్థల్లో మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కాయి. ప్రముఖ టెక్‌ సంస్థ మెటా (Meta).. భారత సంతతికి చెందిన టెక్‌ నిపుణుడు చిరంతన్ దేశాయ్‌ (Chirantan Desai)ను చీఫ్ ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్ ఆఫీసర్‌గా నియమించింది. ప్రస్తుతం డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థ మ్యాంగోడీబీ (MongoDB)లో సీఈఓగా పనిచేస్తున్న దేశాయ్‌.. అక్కడ ఏడాది కూడా పూర్తికాకముందే మెటాలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ హోదాలో ఆయన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు నేరుగా రిపోర్ట్ చేయనున్నారు.

వివరాలు 

ఏఐ వ్యూహంలో భాగంగానే..

మెటా కొన్ని వారాల క్రితం తన ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా పర్సనల్‌ ఏఐ ఏజెంట్‌ 'మ్యూజ్‌' (Muse)ను తీసుకొచ్చింది.

వ్యాపార సంస్థలు,వినియోగదారులకు అవసరమైన ఏఐ ఆధారిత సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఏఐ ఏజెంట్‌ యాప్‌ను రూపొందించింది.

ఈ నేపథ్యంలో చిరంతన్ దేశాయ్‌ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.

వ్యాపార సంస్థలు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో దేశాయ్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది.

సాధారణంగా మెటా వంటి టెక్‌ సంస్థలు వినియోగదారుల కోసం రూపొందించే యాప్‌లు, సేవలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంటాయి.

అయితే ఏఐ టెక్నాలజీ, టూల్స్‌ను ఇతర వ్యాపార సంస్థలకు అందించడంతోపాటు వాటి ద్వారా ఆదాయం పెంచుకునే లక్ష్యంతో మెటా ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

వివరాలు 

1993లో అమెరికాకు..

ఈ విభాగాన్ని మరింత విస్తరించే క్రమంలో దేశాయ్‌ను కీలక హోదాలోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్‌లో జన్మించిన చిరంతన్ దేశాయ్‌ 1993లో అమెరికాకు వెళ్లారు.

అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీ అర్బానా-ఛాంపెయిన్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.

కంప్యూటర్‌ సైన్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో రెండు మాస్టర్‌ డిగ్రీలు పొందారు.

అనంతరం అదే విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పూర్వవిద్యార్థి అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఒరాకిల్‌తో కెరీర్‌ ప్రారంభం..

చిరంతన్ దేశాయ్‌ తొలుత ఒరాకిల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత ఈఎంసీ, సర్వీస్‌నౌ, క్లౌడ్‌ఫ్లేర్‌, మ్యాంగోడీబీ వంటి ప్రముఖ సంస్థల్లో సీనియర్‌ హోదాల్లో పనిచేశారు.

వివిధ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐ తదితర రంగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

2025 నవంబర్‌లో మ్యాంగోడీబీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

ఏడాది కూడా పూర్తికాకముందే ఇప్పుడు మెటాలో చీఫ్ ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్ ఆఫీసర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

ADVERTISEMENT