Loading...
NASA: ఆర్టెమిస్-3కు ఈ నలుగురే ఎందుకు? నాసా ఎంపిక వెనుక అసలు కారణం!
ఆర్టెమిస్-3కు ఈ నలుగురే ఎందుకు? నాసా ఎంపిక వెనుక అసలు కారణం!

NASA: ఆర్టెమిస్-3కు ఈ నలుగురే ఎందుకు? నాసా ఎంపిక వెనుక అసలు కారణం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రుడిపై మానవుల అడుగుజాడలను మళ్లీ ముద్రించాలనే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ కార్యక్రమం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. ఆర్టెమిస్-3 మిషన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల వివరాలను వెల్లడించింది. అయితే ఈ బృందంలో చోటు దక్కింది వీరికే ఎందుకు? అనే చర్చ ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఆసక్తికరంగా మారింది. నాసా ప్రకటించిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్‌,యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పార్మిటానో,నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో,ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఆండ్రే డగ్లస్ మినహా మిగిలిన ముగ్గురికి ఇప్పటికే అంతరిక్ష యాత్రల అనుభవం ఉంది.

వివరాలు 

రాండీ బ్రెస్నిక్.. మిషన్‌కు నాయకుడు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సేవలు, స్పేస్‌వాక్‌లు, టెస్ట్ పైలటింగ్‌, క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది.

ఆర్టెమిస్-3 కమాండర్‌గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు.

అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలు, పరీక్షా విమానాలను నడిపారు.

రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేయడమే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్‌గా కూడా పనిచేశారు.

పలు స్పేస్‌వాక్‌లలో పాల్గొన్న ఆయన దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల నిర్వహణలో విశేష అనుభవాన్ని సంపాదించారు.

వివరాలు 

లూకా పార్మిటానో.. యూరప్ ప్రతినిధి

ఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు.

మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇటాలియన్‌గా గుర్తింపు పొందారు.

స్పేస్‌వాక్‌లలో అపార అనుభవం కలిగిన ఆయన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం సంపాదించారు.

ఆయన ఎంపిక ద్వారా నాసా-యూరప్ అంతరిక్ష భాగస్వామ్యానికి మరింత బలం చేకూరింది.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్రాంక్ రూబియో.. రికార్డు హోల్డర్

నాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన ఆయనకు మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలపై విస్తృత అనుభవం ఉంది. ఈ నైపుణ్యం భవిష్యత్ చంద్రయాత్రల్లో కీలకంగా మారనుంది.

ఆండ్రే డగ్లస్.. ప్రత్యేక ఎంపిక

ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌, మానవ-యంత్ర వ్యవస్థల అభివృద్ధిలో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది.

చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక వ్యవస్థల రూపకల్పనలో చేసిన కృషిని గుర్తించిన నాసా ఆయనకు అవకాశం కల్పించింది.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా-యూరప్ భాగస్వామ్యానికి నిదర్శనం

ఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉంది.

భవిష్యత్ చంద్ర అన్వేషణలు అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయని ప్రపంచానికి చాటి చెప్పడమే నాసా ఉద్దేశం.

ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా ఉండటంతో లూకా పార్మిటానో ఎంపికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

వివరాలు 

ఇది చంద్రుడిపై ల్యాండింగ్ కాదు.. ఫైనల్ ట్రయల్

ఆర్టెమిస్-3 గురించి చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఇదే చంద్రుడిపై మనుషులను దించే మిషన్ అని..కానీ వాస్తవానికి ఇది భవిష్యత్ చంద్రయాత్రలకు ముందు జరిగే అత్యంత కీలక సాంకేతిక పరీక్ష.

వ్యోమగాములను సురక్షితంగా చంద్రుడిపై దించేందుకు అవసరమైన విధానాలను ఈ మిషన్‌లో పరీక్షిస్తారు.

సుమారు రెండు వారాల పాటు సాగే ఈ యాత్రలో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్ర ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియలను సాధన చేస్తారు.

భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి కీలక సమాచారాన్ని సేకరిస్తారు.

వివరాలు 

బ్లూ ఒరిజిన్, స్పేస్‌ఎక్స్ కీలక పాత్ర

ఈ మిషన్‌లో మరో ప్రత్యేకత ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం.

జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న 'బ్లూ మూన్' ల్యాండర్‌, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ రూపొందిస్తున్న 'స్టార్‌షిప్' హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌లతో వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

భవిష్యత్ అంతరిక్ష రంగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేసే విధానానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది.

అందుకే నాసా దీన్ని "మూన్ ల్యాండింగ్‌కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.

వివరాలు 

ఎందుకు అంత కీలకం?

ఆర్టెమిస్-3 విజయవంతమైతే భవిష్యత్ చంద్రయాత్రలకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది.

ఇప్పటి వరకు డిజైన్‌, ఇంజినీరింగ్ దశలో ఉన్న ఆర్టెమిస్ కార్యక్రమం ఇప్పుడు మానవ ప్రయాణాలకు సిద్ధమవుతోందనే సంకేతంగా దీనిని నిపుణులు భావిస్తున్నారు.

1972లో అపోలో-17 మిషన్ తర్వాత మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపై మానవులను తిరిగి దించడంతో పాటు అక్కడ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేయడం,అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా దీర్ఘకాలిక లక్ష్యం.

ఆర్టెమిస్-3 విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 మిషన్‌కు మార్గం మరింత సుగమం కానుంది.

వివరాలు 

ఎందుకు అంత కీలకం?

అయితే ప్రస్తుతం ప్రకటించిన ఈ నలుగురే తుది బృందమా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

అయినప్పటికీ భవిష్యత్ చంద్రయాత్రల విజయానికి తొలి అడుగుగా నాసా ఆశలన్నీ ప్రస్తుతం ఈ బృందంపైనే నిలిచాయి.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు చేరుకుంటారు.

వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతారు.

అక్కడ సుమారు వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరనున్నారు.

ADVERTISEMENT