planet parade : ఖగోళ అద్భుతం: ఆకాశంలో గ్రహ చతుష్టయం.. ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం కనిపించబోతోంది. మెర్క్యూరీ, మార్స్, సాటర్న్,నెప్చ్యూన్ గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఈ గ్రహాల సరళి భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపించనుంది. ముఖ్యంగా ఏప్రిల్ 18 నుంచి 20 మధ్య వీక్షణకు ఉత్తమ సమయం. తెల్లవారుజామున తూర్పు దిశలో ఈ గ్రహాలు సమూహంగా కనిపిస్తాయి.
వివరాలు
రోజుకో విధంగా ఆకారం మారుతూ కనిపించనున్న రేఖ
సూర్యోదయం కంటే సుమారు అరగంట ముందు, అంటే ఉదయం 5 గంటల నుంచి 5:45 మధ్య చూడవచ్చు. మెర్క్యూరీ హారిజన్ దగ్గర కాస్త మందంగా కనిపిస్తే, సాటర్న్ పసుపు రంగులో కనిపిస్తుంది. మార్స్ ఎరుపు వెలుగుతో స్పష్టంగా కనిపిస్తుంది. నెప్చ్యూన్ మాత్రం కన్నులతో కనిపించదు, టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ అవసరం. ఈ రేఖప్రత్యేకత ఏమిటంటే, రోజుకో విధంగా ఆకారం మారుతూ కనిపిస్తుంది. మొదట ట్రయాంగిల్ లా కనిపించి, తర్వాత సూటిగా లైన్ లా మారుతుంది.