Windows 11 App Updates: 20 ఏళ్ల అప్‌డేట్ పాప్‌అప్‌లకు చెక్.. విండోస్ 11లో కీలక మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
కంప్యూటర్‌లో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక్కసారిగా "Update Available" అంటూ పాప్‌అప్ రావడం చాలామందికి చిరాకు తెప్పించే విషయమే. ముఖ్యంగా IDM, Chrome, Firefox, VLC వంటి థర్డ్‌పార్టీ యాప్స్ తమకు తామే అప్‌డేట్ నోటిఫికేషన్లు ఇస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు Windows 11 కొత్త విధానాన్ని సిద్ధం చేస్తోంది. Settingsలో కనిపిస్తున్న "App updates" అనే ఫీచర్ ద్వారా వివిధ యాప్స్ అప్‌డేట్లను ఒకే చోటికి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఈ ఫీచర్ తొలిసారి 2025 డిసెంబర్‌లో కనిపించగా, తాజాగా విండోస్ 11 26H2 ప్రివ్యూ బిల్డ్‌లో మళ్లీ కనిపించింది. అంటే సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చే దశ దగ్గరపడినట్టే.
Details
అన్ని యాప్స్ అప్‌డేట్లు ఒకే చోట
ప్రస్తుతం Windows Update ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్, డ్రైవర్లు, కొన్ని Microsoft ఉత్పత్తుల అప్‌డేట్లు వస్తాయి.
Microsoft Storeలో లభించే యాప్స్‌కు కూడా ప్రత్యేక అప్‌డేట్ వ్యవస్థ ఉంది. కానీ Chrome, Firefox, VLC, MPV వంటి సంప్రదాయ Win32 యాప్స్ మాత్రం తమ సొంత అప్‌డేట్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నాయి.
అందుకే ప్రతి యాప్‌కు ప్రత్యేకంగా పాప్‌అప్‌లు కనిపిస్తుంటాయి. Microsoft తీసుకొస్తున్న Windows Update Orchestration Platform (UOP) ద్వారా డెవలపర్లు తమ యాప్స్‌ను Windows 11లో అప్‌డేట్ ప్రొవైడర్లుగా నమోదు చేసుకోవచ్చు.
అలా చేస్తే Windows వాటి అప్‌డేట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైనప్పుడు ఇన్‌స్టాలేషన్‌ను సమన్వయం చేయగలదు. అయితే డెవలపర్లు ముందుగా ఈ వ్యవస్థలో చేరాలి.
Details
యూజర్ పని చేస్తున్నప్పుడు అప్‌డేట్ కాదు
ఈ విధానంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. Windows 11 యూజర్ కంప్యూటర్‌ను ఎలా ఉపయోగిస్తున్నాడో కూడా పరిగణనలోకి తీసుకుని అప్‌డేట్ల సమయాన్ని నిర్ణయించనుంది.
బ్యాటరీ స్థాయి, ఇంటర్నెట్ కనెక్షన్, యూజర్ యాక్టివిటీ, సిస్టమ్ పరిస్థితి వంటి అంశాలను పరిశీలించి అప్‌డేట్‌ను షెడ్యూల్ చేయవచ్చు.
డెవలపర్లు అందించే స్కానర్ ద్వారా అందుబాటులో ఉన్న కొత్త వెర్షన్లను Windows గుర్తిస్తుంది.
డిఫాల్ట్‌గా ఈ పరిశీలన వ్యవధి 22 గంటలుగా ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు నెలల తరబడి ఓపెన్ చేయని యాప్‌లో కీలకమైన సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చినా, యూజర్‌కు తెలియకపోవచ్చు.
కొత్త విధానం అమల్లోకి వస్తే ఇలాంటి యాప్స్‌ను కూడా Windows గుర్తించి అప్‌డేట్ చేయగలదు.