X: దొంగ కంటెంట్‌పై X కఠిన చర్యలు.. రీపోస్ట్ అకౌంట్లకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X.. ఇతరుల వీడియోలను దొంగిలించి మళ్లీ పోస్టు చేసే అకౌంట్లపై కఠిన చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న క్రియేటర్ల వైరల్ వీడియోలను పెద్ద అకౌంట్లు రీపోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న వ్యవహారంపై X దృష్టి సారించింది. ప్లాట్‌ఫామ్‌లో ఎంగేజ్‌మెంట్ ఫార్మింగ్, రెవెన్యూ షేరింగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
'ఒరిజినల్ క్రియేటర్‌కే క్రెడిట్'
ఈ విషయాన్ని X హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ నికితా బియర్ తన పోస్టులో వెల్లడించారు. చిన్న అకౌంట్ల కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా మళ్లీ అప్‌లోడ్ చేసి రెవెన్యూ షేర్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్న పెద్ద అకౌంట్లను గుర్తించామని తెలిపారు. ఇకపై రీపోస్ట్ చేసిన వీడియోలకు వచ్చిన వ్యూస్, ఇంప్రెషన్స్ అన్నీ ఒరిజినల్ క్రియేటర్‌కే వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వివరాలు
'షేర్ వీడియో', 'కోట్' ఫీచర్ల వినియోగంపై సూచన
ఇతరుల వీడియోలను షేర్ చేయాలనుకునేవారు Xలో ఉన్న "Share Video" లేదా "Quote" ఫీచర్లను ఉపయోగించాలని నికితా బియర్ సూచించారు. ఇలా చేస్తే అసలు క్రియేటర్‌కు సరైన క్రెడిట్ దక్కుతుందని తెలిపారు. ఇతరుల కంటెంట్‌ను రీప్యాకేజ్ చేసి డబ్బులు సంపాదించే అకౌంట్లకు చెల్లింపులు తగ్గించే దిశగా X ముందుకెళ్తోందని తెలుస్తోంది.
వివరాలు
పెద్ద అకౌంట్ల ఆదాయానికి బ్రేక్
తమ వీడియోలను పెద్ద అకౌంట్లు క్రెడిట్ ఇవ్వకుండా మళ్లీ పోస్టు చేస్తున్నాయంటూ ఓ క్రియేటర్ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన X ఉద్యోగి.. "మీరు అసలు వీడియో యజమాని కావడంతో ఆ పోస్టుల ద్వారా పెద్ద అకౌంట్లకు ఆదాయం రాదు" అని స్పష్టం చేశారు. కాపీక్యాట్ కల్చర్‌కు చెక్ Xలో అమల్లో ఉన్న క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ కారణంగా కాపీక్యాట్ కల్చర్ పెరిగిందనే విమర్శలు వచ్చాయి. ట్రెండింగ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసి వెంటనే రీపోస్ట్ చేయడం ద్వారా కొన్ని వెరిఫైడ్ అకౌంట్లు వేల డాలర్లు సంపాదిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తాజా అప్‌డేట్‌తో ఆ లూప్‌హోల్‌ను మూసేసి ఒరిజినల్ క్రియేటర్లకే ప్రయోజనం చేకూరేలా X చర్యలు చేపట్టింది.