X Down: 'ఎక్స్' డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ 'ఎక్స్(మునుపటి ట్విటర్)'సేవలకు అంతరాయం ఏర్పడింది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం ఈ సమస్య ఉత్పన్నమైంది.
'ఎక్స్' ఖాతాలను తెరవగానే ఖాళీ పేజీ మాత్రమే కనిపిస్తోందని పలువురు యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికల్లో ఫిర్యాదులు చేశారు.
డౌన్‌డిటెక్టర్ పోర్టల్ ప్రకారం, భారత్‌లో ఇప్పటివరకు దాదాపు 2,000కిపైగా ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తోంది.
అమెరికాలో 18,000 మంది,యూకేలో 10,000 మంది'ఎక్స్'సేవలు అందడం లేదని తమ పోస్టుల్లో పేర్కొన్నారని సమాచారం.
అమెరికాలో దాదాపు 57%మంది ఈసమస్యను ఎదుర్కొన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
దీనిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.సిబ్బంది కొరత,సాంకేతిక సమస్యల కారణంగా గతంలో కూడా'ఎక్స్'సేవలు పలు మార్లు నిలిచిపోయిన ఘటనలు జరిగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రపంచవ్యాప్తంగా 'ఎక్స్'సేవలలో అంతరాయం
The X platform cannot be accessed from many places in the world. #XDOWN pic.twitter.com/ImXqV8XQDX
— COINOTAG NEWS (@coinotagen) March 10, 2025