Page Loader
రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే 
రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే

రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Oct 28, 2023
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X( ట్విట్టర్) రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది. ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా బేసిక్, ప్రీమియం+ పేరుతో రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టారు. వీటికి తోడు ఇప్పటికే ప్రీమియం ప్లాన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్లాన్ ఎంపికను బట్టి సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. బేసిక్ ప్రైజ్ నెలకు రూ. 244 నుంపవ రూ.13,600 వరకు ప్లాన్లు ఉన్నాయి. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత 'ఎక్స్(X)'గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఆ కొత్త ప్లాన్ల ఆవశ్యత ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

ట్విట్టర్

కొత్త ప్లాన్‌ల వివరాలు ఇవే..

అన్ని రకాల యూజర్లకు అందుబాటులో ఉండేలా మస్క్ ఈ కొత్త ప్లాన్ లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో బేసిక్ ప్లాన్ నెలకు రూ. 244 నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు వార్షిక ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే, దాని ధర రూ. 2,590 అవుతుంది. ప్రీమియం+ ప్లాన్‌కి నెలకు రూ. 1,300 ఖర్చవుతుంది. వినియోగదారులు వార్షిక సభ్యత్వం తీసుకుంటే రూ. 13,600 చెల్లించాల్సి ఉంటుంది. రెండు కొత్త ప్లాన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ.650 ఖర్చవుతుంది.

ట్విట్టర్

బేసిక్, ప్రీమియ+ ప్లాన్ల మధ్య తేడాలు ఇవే 

మీరు బేసిక్ ప్లాన్‌ను తీసుకుంటే, బ్లూ వెరిఫికేషన్ చెక్ మార్క్‌ని పొందలేరు. వినియోగదారులు పోస్టులకు బూస్ట్ పొందుతారు. అంతేకాకుండా, వినియోగదారులు ట్వీట్‌ను సవరించడం, పొడవైన ట్వీట్‌లను(4,000 అక్షరాల వరకు) పోస్ట్ చేయవచ్చు. పొడవైన వీడియోలను (20 నిమిషాల వరకు), రెండు-కారకాల ప్రామాణీకరణ, లైక్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ను సేవ్ చేసుకునే ఫీచర్లను పొందుతారు. బేసిక్ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ అయితే యూజర్లకు యాడ్ ఫ్రీ అనే ఆఫ్షన్ ఉండదు. ప్రీమియం+ ప్లాన్‌ను తీసుకుంటే బ్లూ టిక్‌ను పొందవచ్చు. వినియోగదారుడి టైమ్‌లైన్‌లో ప్రకటనలు కనిపించవు. ప్రీమియం+ వినియోగదారుల పోస్ట్ బూస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను పోస్టు చేయవచ్చు. కంటెంటే నిడివికి పరిమిది అనేది ఉండదు. ఇలా చాలా ఫీచర్లు ప్రీమియం+ యూజర్లు పొందవచ్చు.