Loading...
X open-sources: యూజర్లకు X గుడ్‌న్యూస్.. అల్గారిథమ్ వివరాలు ఇక బహిరంగం
యూజర్లకు X గుడ్‌న్యూస్.. అల్గారిథమ్ వివరాలు ఇక బహిరంగం

X open-sources: యూజర్లకు X గుడ్‌న్యూస్.. అల్గారిథమ్ వివరాలు ఇక బహిరంగం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎక్స్ (X) తన అల్గారిథమ్‌ను ఓపెన్ సోర్స్ చేసింది. దీంతో యూజర్లు తమ అకౌంట్ లేదా పోస్టులపై ర్యాంకింగ్ వ్యవస్థల ప్రభావం ఏమైనా ఉందా? తమను షాడో బ్యాన్ చేశారా? అనే విషయాలను చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గతంలో ట్విట్టర్‌గా ఉన్న ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ తన "For You"అల్గారిథమ్‌తో పాటు కీలకమైన ర్యాంకింగ్ ఇంజిన్‌ను ఓపెన్ సోర్స్ చేసింది. తన కోడ్‌బేస్‌లోని మరిన్ని భాగాలను GitHubలో Apache v2 లైసెన్స్ కింద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు X తెలిపింది. ఇందులో భాగంగా యూజర్లు తమ అకౌంట్లు లేదా పోస్టులపై ఈ ర్యాంకింగ్ వ్యవస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది.

వివరాలు

కోడ్‌బేస్ 10-15 రెట్లు పెరిగింది..

Xలో డిఫాల్ట్‌గా కనిపించే "For You" టైమ్‌లైన్‌కు సంబంధించిన సోర్స్ కోడ్‌ను ఇప్పుడు GitHubలో Apache v2 లైసెన్స్ కింద అందుబాటులో ఉంచారు.

గతంలో చేపట్టిన ఓపెన్ సోర్స్ కార్యక్రమాలను కూడా కంపెనీ మరింత విస్తరించింది.

ఇందులో మోడల్ కాన్ఫిగరేషన్, ఫిల్టర్లు, ప్రధాన ర్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను చేర్చింది.

దీంతో గతంలో అందుబాటులో ఉన్న కోడ్‌తో పోలిస్తే ఇప్పుడు ఓపెన్ సోర్స్ చేసిన కోడ్‌బేస్ దాదాపు 10 నుంచి 15 రెట్లు పెద్దదిగా మారింది.

వివరాలు

కీలకమైన ర్యాంకింగ్ కోడ్ కూడా విడుదల..

ఈ ఓపెన్ సోర్స్ విడుదలలో వ్యక్తిగత యూజర్లకు పోస్టులను ఎంపిక చేసి, వాటికి ర్యాంకింగ్ ఇచ్చే ప్రధాన కోడ్ కూడా ఉందని X ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ కీత్ కోల్‌మన్ TechCrunchతో మాట్లాడుతూ వెల్లడించారు.

సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉన్న కంటెంట్‌ను ఫిల్టర్ చేసే వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు.

ర్యాంకర్, స్కోర్ వంటి కొన్ని సిస్టమ్స్‌ను కంపెనీ బయట కూడా రన్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

యూజర్ల కోసం కొత్త పారదర్శకత టూల్

కోడ్‌ను విడుదల చేయడంతో పాటు, తమ ర్యాంకింగ్ వ్యవస్థలు అకౌంట్ లేదా పోస్టులపై ఎలాంటి ప్రభావం చూపించాయో తెలుసుకునేందుకు యూజర్లకు కొన్ని టూల్స్‌ను కూడా X అందుబాటులోకి తెస్తోంది.

యాప్‌లోని సెట్టింగ్స్‌లో "Under the Hood" అనే పేజీలో కొత్త ట్రాన్స్‌పరెన్సీ టూల్ అందుబాటులో ఉంటుంది.

గత నెలలో కనీసం 10 పోస్టులు చేసిన యూజర్లు ఈ పేజీ నుంచి తమ మొత్తం గణాంకాలను JSON ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

అల్గారిథమ్ మెరుగుపర్చేందుకు డెవలపర్లకు అవకాశం..

GitHub రిపాజిటరీ ద్వారా డెవలపర్లు అల్గారిథమ్‌లో మార్పులు లేదా మెరుగుదలలను సూచిస్తూ పుల్ రిక్వెస్టులు పంపవచ్చు.

వాటిని X ఇంజినీర్లు పరిశీలించి, అవసరమైతే అల్గారిథమ్‌లో చేర్చుతారు.

అయితే డెవలపర్లు పంపే ప్రతి మార్పును స్వీకరించబోమని కంపెనీ స్పష్టం చేసింది.

అయినప్పటికీ అల్గారిథమ్‌ను మెరుగుపరచడంలో ప్రజల భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని కోల్‌మన్ తెలిపారు.

అయితే నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉన్న పోస్టులను అంచనా వేయడానికి Grokను ఉపయోగించే కొన్ని సిస్టమ్స్‌ను మాత్రం ఈ విడుదలలో చేర్చలేదు.

వాటిని అందుబాటులో ఉంచితే దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న వ్యక్తులు వాటిని తప్పుగా ఉపయోగించుకునే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT